Home /News /sports /

IPL 2022 KKR VS MI LIVE SCORE UPDATES MUMBAI INDIANS SETS FIGHTING TOTAL ON SCORE BOARD SRD

IPL 2022 - KKR vs MI : సూర్య మ్యాజిక్.. తిలక్, పొలార్డ్ మెరుపులు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

IPL 2022 - KKR vs MI

IPL 2022 - KKR vs MI

IPL 2022 - KKR vs MI : ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ టూ హెడ్ రికార్డుల్లో ముంబై పూర్తి అధిపత్యాన్ని క‌న‌బ‌ర్చింది. రెండు జ‌ట్లు ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 29 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు స్థాయిలో 22 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. కోల్‌క‌తా కేవ‌లం 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.

ఇంకా చదవండి ...
    పుణె వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కష్టాల్లో ఉన్న ముంబైని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ గట్టెక్కించారు. ఈ ఇద్దరి జోరుకు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ( 36 బంతుల్లో 52 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (27 బంతుల్లో 38 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ ( 19 బంతుల్లో 29 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో పొలార్డ్ 5 బంతుల్లో 22 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమిన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఉమేశ్, వరుణ్ చక్రవర్తీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్‌ తమ ఇన్నింగ్స్ చాలా నిదానంగా ప్రారంభించింది. కోల్ కతా బౌలర్లు పేస్ ధాటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పరుగులు చేయలేకపోయారు. దీంతో, ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన రోహిత్‌.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, ఆరు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ముంబై.

    అయితే, ఐపీఎల్‌లో డెబ్యూ మ్యాచ్‌ ఆడుతున్న బేబీ డివిలియర్స్ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కొంచెం సేపు తన మెరుపులతో అలరించాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న డేవాల్డ్ బ్రెవిస్ ను వరుణ్‌ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చేశాడు. ఇది గమనించిన సామ్‌ బిల్లింగ్స్‌ వేగంగా వికెట్లను గిరాటేశాడు. దీంతో, 45 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది రోహిత్ సేన. ఆ వెంటనే ఇషాన్‌ కిషన్‌(14) శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


    ఐపీఎల్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లో ఇషాన్‌ కిషన్‌ కమిన్స్‌కు చిక్కడం ఇది మూడోసారి. దీంతో, 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, కష్టాల్లో ఉన్న ముంబైను సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ దొరికిన చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించి పరుగులు రాబట్టారు. ఓ దశలో ముంబై స్కోరు 120 పరుగులైనా దాటుతుందో లేదో అనుకున్నారు.

    కానీ, వీరిద్దరి జోరుకు ముంబై మంచి స్కోరు సాధించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖర్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సూర్య ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో సామ్ బిల్లింగ్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వీరిద్దరూ మధ్య నాలుగో వికెట్ కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరో ఎండ్ లో తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుతమైన షాట్లతో అలరించి.. ముంబై గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఆఖర్లో పొలార్డ్ కూడా మెరుపులు మెరిపించాడు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ టూ హెడ్ రికార్డుల్లో ముంబై పూర్తి అధిపత్యాన్ని క‌న‌బ‌ర్చింది. రెండు జ‌ట్లు ఈ లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 29 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు స్థాయిలో 22 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. కోల్‌క‌తా కేవ‌లం 7 మ్యాచ్‌ల్లోనే గెలిచింది.

    తుది జట్లు :

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, డేవాల్డ్ బ్రెవిస్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమాల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి

    కేకేఆర్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్, రహానే, నితీశ్ రాణా, బిల్లింగ్స్, , రస్సెల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, రసిక్ సలామ్, వరుణ్ చక్రవర్తి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Rohit sharma, Shreyas Iyer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు