హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - KKR vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. ఫస్ట్ టైం రూట్ మార్చిన హార్దిక్.. కేకేఆర్ జట్టులో మూడు మార్పులు..

IPL 2022 - KKR vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. ఫస్ట్ టైం రూట్ మార్చిన హార్దిక్.. కేకేఆర్ జట్టులో మూడు మార్పులు..

IPL 2022 - KKR vs GT

IPL 2022 - KKR vs GT

IPL 2022 - KKR vs GT : సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో గెలిచింది నాలుగు మ్యాచ్‌లలో ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ సూపర్ శాటర్ డేలో భాగంగా కాసేపట్లో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్ లో కొత్తగా వచ్చి దుమ్మురేపుతున్న గుజరాత్ టైటాన్స్ తో పడి లేస్తోన్న కోల్ కతా అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచులో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఫస్ట్ టైం గుజరాత్ కెప్టెన్ రూట్ మార్చాడు. ఫీల్డింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచుకి దూరమైన హార్దిక్ విజయ్ శంకర్ ప్లేసులో తుది జట్టులోకి వచ్చాడు. ఇక, కేకేఆర్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్, షెల్డన్ జాకన్స్ లను పక్కన పెట్టి.. టిమ్ సౌథీ, రింకు సింగ్, సామ్ బిల్లింగ్స్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక, సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో గెలిచింది నాలుగు మ్యాచ్‌లలో ఓడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో కేకేఆర్ దీటుగా పోరాడినా చివరికి ఓడిపోయింది.

  గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 సీజన్ లో దుమ్మురేపుతోంది. మంచి విజయాలను అందుకుంటుంది. చెన్నైతో జరిగిన చివరి మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించడంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 2స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి టాప్ 1స్థానంలోకి వెళ్లాలని చూస్తోంది. గుజరాత్ బ్యాటింగ్ లో శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ సత్తా చాటుతున్నారు. ఆఖర్లో రాహుల్ తేవటియా మెరుపులు మెరిపిస్తున్నాడు. గత మ్యాచులో రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ లో మెరిశాడు. సాహా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. బౌలింగ్ లో రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఫెర్గ్యూసన్ కీలకం కానున్నారు.

  ఇక, కోల్ కతా జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా పూర్తి స్థాయిలో రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. సునీల్ నరైన్, రస్సెల్, ప్యాట్ కమిన్స్ వంటి టాప్ క్లాస్ ఆల్ రౌండర్లు ఆ జట్టు సొంతం. బ్యాటింగ్ లో ఫర్వాలేదన్పిస్తున్నా.. బౌలింగ్ లో తేలిపోతుంది కేకేఆర్. ఆ జట్టు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్ కాస్త బెటర్ గా బౌలింగ్ వేస్తున్నారు. అయితే, కమిన్స్, శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తీ భారీగా పరుగులు ఇస్తున్నారు. ఆశ్చర్యకరంగా ప్యాట్ కమిన్స్, ఫించ్ ల్ని ఈ మ్యాచులో పక్కన పెట్టింది.

  తుది జట్లు :

  కోల్‌కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

  గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, అల్జెరీ జోసెఫ్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Kolkata Knight Riders, Shreyas Iyer

  ఉత్తమ కథలు