Home /News /sports /

IPL 2022 KIERON POLLARD ACCIDENTALLY HITS UMPIRE WITH BALL CAPTAIN ROHIT SHARMA CANT HOLD HIS SMILE SJN

IPL 2022 : అంపైర్ ను కొట్టరాని చోట కొట్టిన పొలార్డ్.. నవ్వాపుకోలేకపోయిన రోహిత్ శర్మ.. అసలేం జరిగిందంటే?

పొలార్డ్ (PC : TWITTER)

పొలార్డ్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆఖరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ వారంతంలోపు ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయో అనే విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆఖరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ వారంతంలోపు ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయో అనే విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్ 15వ సీజన్ లో అప్పుడప్పుడూ ఫన్నీ ఇన్సిడెంట్ లు కూడా చోటు చేసుకుంటున్నాయి. డీవై పాటిల్ వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 52 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి  : విశ్రాంతి పేరుతో వేటుకు రంగం సిద్ధం చేసిన బీసీసీఐ! సౌతాఫ్రికాతో సిరీస్ కు కోహ్లీని పక్కన పెట్టే ఛాన్స్!

అయితే కేకేఆర్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేయడానికి కీరన్ పొలార్డ్ వచ్చాడు.  నితీశ్ రాణా స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్నాడు. పొలార్డ్ బౌలింగ్ చేసే క్రమంలో డ్యూ వల్ల బంతి చేతి నుంచి జారి వెనక ఉన్న అంపైర్ పొట్ట భాగంలో తాకింది. ఊహించని ఈ సంఘటనకు షాక్ గురైన అంపైర్ క్రిస్ గాఫానీ.. అనంతరం ఏం ఫర్వాలేదంటూ బాల్ ని డెడ్ బాల్ గా ప్రకటించాడు. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తోన్న రోహిత్ శర్మ ఈ ఘటనను చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై 52 పరుగుల తేడాతో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని కేకేఆర్ విజయం సాధించింది. 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు 17.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన ప్యాట్ కమన్స్ 3 వికెట్లతో మెరిశాడు. ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లతో అతడికి చక్కగా సహకరించాడు. ముంబై జట్టు తరఫున ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ లీగ్ లో ఐదో విజయాన్ని అందుకుంది. 12 మ్యాచ్ ల్లో 10 పాయింట్లు సాధించి లీగ్ టేబుల్ లో 7వ స్థానానికి చేరుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gujarat Titans, IPL, IPL 2022, Kieron pollard, KL Rahul, Lucknow Super Giants, Mohammed Siraj, Mumbai Indians, Rashid Khan, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు