హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: కేన్ విలియమ్సన్ అవుట్ పై మరోసారి దుమారం... నో బాల్ కు అవుటైనా గుర్తించని అంపైర్?

IPL 2022: కేన్ విలియమ్సన్ అవుట్ పై మరోసారి దుమారం... నో బాల్ కు అవుటైనా గుర్తించని అంపైర్?

కేన్ విలియమ్సన్ అవుటైనప్పుడు లక్నో ఫీల్డింగ్ (PC: TWITTER)

కేన్ విలియమ్సన్ అవుటైనప్పుడు లక్నో ఫీల్డింగ్ (PC: TWITTER)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్లు కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. దానికి కారణం ఫీల్డ్ లో వారు తీసుకుంటున్న నిర్ణయాలే... మొన్నటికి మొన్న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సారథి కేన్ విలియమ్సన్ (Kane Willianson) క్యాచ్ పై దుమారం లేచిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అంపైర్లు కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. దానికి కారణం ఫీల్డ్ లో వారు తీసుకుంటున్న నిర్ణయాలే... మొన్నటికి మొన్న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సారథి కేన్ విలియమ్సన్ (Kane Willianson) క్యాచ్ పై దుమారం లేచిన సంగతి తెలిసిందే. అందులో విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను నేలకు తాకిన తర్వాత పడిక్కల్ అందుకున్నాడు. ఇది టీవీ రీప్లేలో చాలా చక్కగా కనిపించింది... అయినా కూడా థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. ఇక తాజాగా ఇటువంటి సంఘటనే మరోటి చోటు చేసుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 12 పరుగులు తేడాతో ఓడిపోయింది.

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కేన్ విలియమ్సన్ అవుట్ విషయంలో అంపైర్లు వ్యవహరించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఛేజింగ్ ఆరంభించగా... నాలుగో ఓవర్ వేయడానికి అవేశ్ ఖాన్ బౌలింగ్ కు వచ్చాడు. అతడు వేసిన వేసిన మూడో బంతిని విలియమ్సన్ షార్ట్ ఫైన్ లెగ్ దిశలో గాల్లోకి ఆడగా... అక్కడే ఉన్న ఆండ్రూ టై క్యాచ్ అందుకున్నాడు. ఆండ్రూ టై క్లీన్ క్యాచ్ నే అందుకున్నాడు. అదే సమయంలో అవేశ్ ఖాన్ కూడా నో బాల్ వేయలేదు. అయినా సరే అది నోబాల్. అంపైర్లు ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు.

పవర్ ప్లేలో 30 యార్డ్ సర్కిల్ అవతల కేవలం ఇద్దరు ఫీల్డర్లు ఉండటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే విలియమ్సన్ అవుటయ్యే సమయానికి సర్కిల్ అవతల ముగ్గురు ఫీల్డర్లు ఉన్నారు. ఈ విషయం ఫీల్డ్ సెట్టింగ్ గ్రాఫిక్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం పవర్ ప్లేలో 30 యార్డ్ సర్కిల్ అవతల ఇద్దరు కంటే ఎక్కువ ఫీల్డర్లు ఉంటే దానిని నో బాల్ గా ప్రకటించాలి. అయితే ఈ విషయాన్ని అటు ఫీల్డ్ అంపైర్లు కానీ, ఇటు థర్డ్ అంపైర్ కానీ గుర్తించలేకపోయారు. దీనిపై తాము బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ ఒక ప్రకటనలో పేర్కొనడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు