IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పంజాబ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో (jonny bairstow) చేసిన రనౌట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్ ఏ త్రో అంటూ బెయిర్ స్టోపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం పంజాబ్ కింగ్స్ ను దురదృష్టం వెంటాడింది. 20 పరుగుల తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో లక్నో జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
ఇది కూడా చదవండి : హిట్ మ్యాన్ రోహిత్ సెట్ చేసిన ఈ రికార్డులను టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?
లక్నో బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 14 ఓవర్ వేయడానికి అర్షదీప్ సింగ్ వచ్చాడు. ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో తొలి రన్ పూర్తి చేసుకున్న కృనాల్ పాండ్యా, దీపక్ హుడా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న బెయిర్‌స్టో వేగంగా బంతిని అందుకుని నాన్‌స్టైకర్ ఎండ్ వైపు త్రో చేశాడు. అయితే దీపక్ హుడా రెండో పరుగును కాస్త నెమ్మదిగా చేయడం.. అదే సమయంలో బెయిర్ స్టో విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న వికెట్లను గిరాటేయడంతో దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టులో క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబడతో పాటు రాహుల్ చహర్ కూడా రాణించాడు. చహర్ 2 వికెట్లు తీశాడు. కేఎల్ రాహుల్ కేవలం (6) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో లక్నో జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ జట్టులో జానీ బెయిర్ స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మోసిన్ ఖాన్ 3 వికెట్లతో సత్తా చాటితే.. దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం ద్వారా లీగ్ లో 6వ విజయాన్ని నమోదు చేసిన లక్నో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Punjab kings, Rohit sharma, Virat kohli