IPL 2022 IS RCB SRH PBKS AND KKR STILL MAKES INTO THE PLAYOFFS WHAT ARE THE NEW IPL 2022 PLAYOFFS EQUATIONS SJN
IPL 2022 PLayOffs : ఆర్సీబీ కథ కంచికేనా.? మరి ఆ ఐదు జట్ల సంగతేంటి.? ఢిల్లీ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్.. కొత్త లెక్కలు ఇవే..
ఐపీఎల్ టైటిల్ (ఫైల్ ఫోటో)
IPL 2022 PLayOffs : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో ఆరు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రూపంలో ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
IPL 2022 PLayOffs : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో ఆరు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రూపంలో ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే మిగిలిన మూడు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఏకంగా ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. అయితే వీటిలో రెండు జట్లకు మాత్రమే తమ ప్రదర్శనపై ఆధారపడితే ప్లే ఆఫ్స్ కు చేరుకునే వీలుండగా.. మరో 5 జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను తమ ఆటతో పాటు ఇతర జట్ల ప్రదర్శన కూడా ప్రభావితం చేయనున్నాయి. అంతేకాకుండా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) విజయం సాధించడంతో ప్లే ఆఫ్స్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ కు చేరుకునే వీలుంది.. ఏ జట్టుకు లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈక్వేషన్ 1
ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్ తర్వాత లీగ్ టేబుల్ ను చూస్తే గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రాజస్తాన్.. మూడో స్థానంలో లక్నో జట్లు ఉన్నాయి. ఇక నిన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీని ఢిల్లీ క్యాపిటల్స్ వెనక్కి నెట్టి ఆ స్థానంలో పాగా వేసింది. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ జట్టు చెరో 14 పాయింట్లతో సమంగా ఉన్నా.. ఢిల్లీ నెట్ రన్ రేట్ +.255 ఉండగా.. ఆర్సీబీది -.323గా ఉంది. ఇరు జట్లకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. గురువారం నాడు గుజరాత్ తో ఆర్సీబీ, శనివారం నాడు ముంబై తో ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ఆర్సీబీ, ఢిల్లీ జట్లు గెలిస్తే అప్పుడు ఇరు జట్లు కూడా 16 పాయింట్లతో సమంగా ఉంటాయి. దాంతో నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఢిల్లీ నెట్ రన్ రేట్ ఆర్సీబీ కంటే కూడా చాలా మంచిగా ఉంది. అందులోనూ ఢిల్లీ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఉండటం రిషభ్ పంత్ కు కలిసొచ్చే అంశం. ఒకవేళ ఈ రెండు జట్లు తమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తే అప్పుడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలకు గండి పడినట్లే. ఎందుకంటే ఈ మూడు జట్లు తమ తదుపరి మ్యాచ్ ల్లో గెలిచినా.. వీటికి చేరేది 14 పాయింట్లే కాబట్టి. అప్పుడు ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ మాత్రమే ఉంటాయి. ఇక రాజస్తాన్ తన చివరి మ్యాచ్ ను శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. అదే సమయంలో లక్నో జట్టు తన చివరి మ్యాచ్ ను బుధవారం కేకేఆర్ తో ఆడనుంది. ఈ రెండు పోరుల్లోనూ రాజస్తాన్, లక్నో గెలిస్తే.. అప్పుడు వాటికి 18 పాయింట్లు చేరతాయి. బెటర్ రన్ రేట్ ఉన్న జట్టు రెండో స్థానంలో ఉంటుంది. అప్పుడు ఆర్సీబీ కి ప్లే ఆఫ్స్ చేరడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఆ జట్టు తన చివరి మ్యాచ్ లో గెలిచినా దాని నెట్ రన్ రేట్ బాగాలేదు. గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ కనీసం 100 పరుగుల తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. లేదంటే తమ ఆఖరి పోరులో ఢిల్లీ జట్టు ఓడాల్సి ఉంటుంది.
ఈక్వేషన్ 2
ఢిల్లీ, ఆర్సీబీ, లక్నో, రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్ ల్లో ఓడినట్లు అయితే అప్పుడు.. గుజరాత్ తో పాటు లక్నో, రాజస్తాన్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. ఇక చివరి స్థానం కోసం ఏకంగా 5 జట్లు పోటీలో నిలుస్తాయి. ఆ సమయంలో కేకేఆర్, సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తమ తదుపరి మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ప్లే ఆఫ్స్ చేరే ఆఖరి జట్టుపై సస్పెన్స్ ఈ ఆదివారం జరిగే పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ మ్యాచ్ తో వీడనుంది. ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్ ను ఆదివారం ఆడనున్నాయి. సన్ రైజర్స్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మంగళవారం ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ ఆడనుంది. ఇక్కడ భారీ విజయం సాధించాల్సి ఉంది. లేదంటే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు నేటితోనే తెరపడతాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.