Home /News /sports /

IPL 2022 IPL VIRAL NEWS WANKHEDE FANS CHANTS DINESH KARTHIK NAME AS DK DK DURING THE MATCH VIDEO GOES VIRAL SJN

IPL 2022: ఏంది సామీ ఈ క్రేజ్.. వాంఖడేలో మార్మోగిన దినేశ్ కార్తీక్ నామస్మరణ.. వీడియో వైరల్..

దినేశ్ కార్తీక్ (IPL twitter)

దినేశ్ కార్తీక్ (IPL twitter)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో దినేశ్ కార్తీక్ క్రేజ్ మామూలుగా లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా.. అసలు ఎందుకు ఆర్సీబీ అతడిని ఎంపిక చేసుకుందనే కామెంట్స్ తో ఈ ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. మూడు వారాలు ముగిసే సరికి.. ఇప్పుడు అతడే క్రౌడ్ పుల్లర్ గా మారిపోయాడు.

ఇంకా చదవండి ...
IPL 2022: భారత దేశంలోని క్రికెట్ స్టేడియాల్లో ఇప్పటి వరకు కేవలం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లీ (Virat Kohli), మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)ల నామస్మరణలను మాత్రమే చూసి ఉంటాం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ () వచ్చాక..  విదేశీ ఆటగాళ్లు అయిన క్రిస్ గేల్ (Chris Gayle), ఏబీ డీవిలియర్స్ (ab de villiers)ల చాంట్స్ కూడా చూశాం. ఇక ఈ సీజన్ లో కూడా విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ ల పేర్లు స్టేడియాల్లో మార్మోగుతాయని అంతా భావించారు. అయతే 2022 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు అది జరగలేదు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒకరి పేరును అభిమానులు స్టేడియాల్లో జపిస్తున్నారు. అతడు టీమిండియా రెగ్యులర్ ప్లేయర్ కూడా కాదు. అలా అని గత ఐపీఎల్ సీజన్ లలో దంచి కొట్టిన దాఖలాలు కూడా లేవు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో దినేశ్ కార్తీక్ క్రేజ్ మామూలుగా లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా.. అసలు ఎందుకు ఆర్సీబీ అతడిని ఎంపిక చేసుకుందనే కామెంట్స్ తో ఈ ఐపీఎల్ సీజన్ లో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. మూడు వారాలు ముగిసే సరికి.. ఇప్పుడు అతడే క్రౌడ్ పుల్లర్ గా మారిపోయాడు. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తుంటే డీకే.. డీకే.. (దినేశ్ కార్తీక్ షార్ట్ ఫార్మ్) అంటూ అభిమానులు అతడి పేరును జపిస్తున్నారు. ఇక శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో డీకే క్రేజ్ మరింత పెరిగింది. అతడు బ్యాటింగ్ చేస్తోంటే వాంఖడే స్టేడియంలోని ప్రతి ఒక్కరు కూడా డీకే... డీకే.. అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఒకవైపు అతడు ఫోర్లు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే.. ప్రేక్షకులేమో అతడి నామస్మరణతో హోరెత్తించారు. దాంతో టీవీలో చూసే ప్రతి ప్రేక్షకుడు ప్రత్యేక అనుభూతిని పొందాడు.

ఇది కూడా చూడండి : 4, 4, 4, 6, 6, 4.. దినేశ్ కార్తీక్ కొట్టుడు మామూలుగా లేదు కదా సామీ!



ఇక ఈ మ్యాచ్ లో ముస్తఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్ లో అయితే దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. వరుసగా 4, 4, 4, 6, 6, 4 కొట్టి 28 పరుగులు పిండుకుని అరాచకం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లోనే 66 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో సాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీపై బెంగళూరు జట్టు 16 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, Dinesh Karthik, Glenn Maxwell, IPL, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, Virat kohli

తదుపరి వార్తలు