IPL 2022: కావ్య మారన్ (Kaviya Maran).. ఏ నోట చూసినా ఇప్పుడు ఇదే పేరు బయటకు వస్తోంది. అందుకు కారణం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders)తో జరిగిన మ్యాచ్ లో కావ్య మారన్ సందడి చేయడమే. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు సహ యజమానిగా, సీఈవోగా ఉన్న కావ్య మారన్ శుక్రవారం జరగిన మ్యాచ్ తో మళ్లీ గ్రౌండ్ లో ప్రత్యక్షమైంది. ఈ సీజన్ ఆరంభంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస అపజయాలు ఎదురవ్వడంతో విపరీతమైన ట్రోల్ ఎదుర్కొన్న ఆమె.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఫ్లాగ్ పట్టుకొని సందడి చేసే ఆమె.. గత రెండు మ్యాచ్ లకు గ్రౌండ్ లో కనిపించలేదు.
అయితే ఆ రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ విజయం సాధించడం విశేషం. దాంతో కావ్య మారన్ గ్రౌండ్ కు రాకుంటేనే మంచిది అనే అభిప్రాయాన్ని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. అయితే శుక్రవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ ద్వారా మళ్లీ ఆమె మైదానంలో ప్రత్యక్షమైంది. దాంతో హైదరాబాద్ అభిమానుల్లో మళ్లీ కలవరం మొదలైంది. మళ్లీ ఓడిపోతామా అనే భయం వాళ్లను మ్యాచ్ ముగిసే వరకు వెంటాడింది. అయితే మార్కరమ్, రాహుల్ త్రిపాఠిలు వీరోచితంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించడంతో ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అయ్యారు. ఇక స్టేడియంలో ఉన్న కావ్య మారన్ అంతకు మించి ఖుషీ అయ్యారు. ఫ్లాగ్ ఊపుతూ పండగ చేసుకున్నారు. మొన్నటి దాకా వాడిపోయిన మొహంలా ఉన్న ఆమె మొహం నిన్నటి మ్యాచ్ లో మాత్రం ఒలింపిక్ జ్యోతిలా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
The smile finally returns. #KaviyaMaran @SunRisers - The folks from #Bhagyanagar has something to cheer for. #IPL2022 pic.twitter.com/2LiR1F18yt
— Shivoham 🕉🔱 (@nivasams) April 15, 2022
Kavya maran is happy... so we are all happy!!
GREAT WIN #SunrisersHyderabad @SunRisers #SRHvsKKR #RahulTripathi #Markram #kanemama #SRH #KavyaMaran pic.twitter.com/gsZ4PxMI3R
— Arjun Gupta (@ArjunGupta46) April 15, 2022
దాంతో ఫ్యాన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరేమో కావ్య మారన్ లో ఉన్న క్రికెట్ లవర్ ను పొగుడుతుంటే.. మరికొందరేమో మూడు విజయాలకే సంతోషపడిపోకు అంటున్నారు. ఏదో లక్ కొద్ది గెలిచామని మరికొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా తాను గ్రౌండ్ కు వస్తే సన్ రైజర్స్ ఓడిపోతుందనే వాదనను కావ్య మారన్ నిన్నటి మ్యాచ్ తో తప్పని నిరూపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma, Sunrisers Hyderabad