IPL 2022 IPL VIRAL NEWS RAJASTHAN ROYALS BOWLER YUZVENDRA CHAHAL TROLL HINDI COMMENTATOR AKASH CHOPRA ON 8 RUN SIXER TWEET SJN
IPL 2022: ఐపీఎల్ లో కొత్త రూల్స్.. 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడితే అవుట్?
ఐపీఎల్ (ఫైల్ ఫోటో)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయా? ఇకపై బ్యాటర్ కొట్టిన సిక్సర్ 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం వెళితే ఎనిమిది పరుగులు ఇవ్వనున్నారా? అదే విధంగా ఒక బ్యాటర్ వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడితే అవుట్ గా ప్రకటించే అవకాశం ఉందా? హెడ్డింగ్ చూసిన తర్వాత మీకు ఈ డౌట్ రావడం సహజమే.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయా? ఇకపై బ్యాటర్ కొట్టిన సిక్సర్ 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం వెళితే ఎనిమిది పరుగులు ఇవ్వనున్నారా? అదే విధంగా ఒక బ్యాటర్ వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడితే అవుట్ గా ప్రకటించే అవకాశం ఉందా? హెడ్డింగ్ చూసిన తర్వాత మీకు ఈ డౌట్ రావడం సహజమే. అయితే ఈ రూల్స్ ను బీసీసీఐ (BCCI) ప్రతిపాదించలేదు. ఐపీఎల్ కామెంటేటర్, భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) ఈ రెండు రూల్స్ లో ఒక దానిని ప్రతిపాదించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆకాశ్ చోప్రా హిందీ కామంటేటర్ గా ఉండగా... రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా తేలాడు. దాంతో అతడు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన విషం తెలిసిందే. ఈ సిక్సర్ పై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ఇకపై ఐపీఎల్ లో 100 మీటర్లు దాటే సిక్సర్ కు ఆరు పరుగులు కాకుండా 8 పరుగులు ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ దీనికి కౌంటర్ ఇచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్ కు 8 పరుగులు ఇస్తే... వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడిన ప్లేయర్ ను అవుట్ గా ప్రకటించాలి అంటూ కొత్త రూల్ ను ప్రతిపాదించాడు. దీనికి సంబందించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆకాశ్ చోప్రా ఒక బ్యాటర్ కాబట్టి అతడు బ్యాటర్ వైపు నుంచి ఆలోచించాడు. అదే సమయంలో చహల్ కూడా బౌలర్ల కు మద్దతుగా 3 డాట్ బాల్స్ రూల్ తో ఆకాశ్ చోప్రాకు కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇదంతా కూడా ఓ సరదా సంభాషణ మాత్రమే. ఏమో చెప్పలేం... రేప్పోద్దున క్రికెట్ కు మరింత ఆదరణ కల్పించేందుకు ఆకాశ్ చోప్రా, యుజువేంద్ర చహల్ లు పేర్కొన్న రూల్స్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.