Home /News /sports /

IPL 2022 IPL VIRAL NEWS MAIN REASON FOR RISHI DHAWAN WEARING FACE GUARD WHILE BOWLING DURING CSK VS PBKS MATCH SJN

IPL 2022 : ఫేస్ గార్డ్ తో పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..

రిషి ధావన్ (PC: TWITTER)

రిషి ధావన్ (PC: TWITTER)

IPL 2022 : ఈ మ్యాచ్ లో చాలా రోజుల తర్వాత ఆడిన హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్ రిషి ధావన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అందుకు కారణం అతడి ఫేస్ గార్డ్. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా బ్యాటర్ తరహా హెల్మెంట్ లాంటిది తలకు వేసుకొని బౌలింగ్ చేసింది లేదు. కానీ, రిషి ధావన్ చెన్నై తో జరిగిన మ్యాచ్ ద్వారా కొత్త పోకడలకు నాంది పలికాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), పంజాబ్ కింగ్స్ (Punjab KIngs) జట్ల మధ్య రసవత్తర పోరు జరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ లో చెన్నై విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఖాయం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో చాలా రోజుల తర్వాత ఆడిన హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్ రిషి ధావన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అందుకు కారణం అతడి ఫేస్ గార్డ్. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా బ్యాటర్ తరహా హెల్మెంట్ లాంటిది తలకు వేసుకొని బౌలింగ్ చేసింది లేదు. కానీ, రిషి ధావన్ చెన్నై తో జరిగిన మ్యాచ్ ద్వారా కొత్త పోకడలకు నాంది పలికాడు.

ఇది కూడా చదవండి : బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సచిన్ గారాల కూతురు..! బీ టౌన్ లో జోరుగా ప్రచారం..

అసలు రిషి ధావన్ ఫేస్ గార్డ్ పెట్టుకొని ఎందుకు బౌలింగ్ చేశాడు? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తడం సహజం. తొలుత.. బౌలింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్ కొట్టే స్ట్రయిట్ డ్రైవ్ లు బౌలర్ తలకు తగిలే అవకాశం ఉంటుంది. దాంతో ఒకవేళ తగిలినా బౌలర్ కు ఏం కాకూడదనే ముందు జాగ్రత్త చర్యగా రిషి ఫేస్ గార్డ్ వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. రిషి ధావన్ ఫేస్ గార్డ్ వెనుక చాలా పెద్ద కథే ఉందని తేలింది. అదేంటంటే.. ఐపీఎల్ ఆరంభానికంటే కూడా ముందు రిషి ధావన్ దేశవాళి క్రికెట్ లో పాల్గొన్నాడు. అలా ఒక మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి నేరుగా వచ్చి అతడి ముక్కును తాకింది. దాంతో అతడి ముక్కు విరిగిపోగా.. చిన్నపాటి సర్జరీ కూడా అనివార్యమైంది. దాంతో అతడు చాలా రోజుల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు.



తాజాగా కోలుకున్న అతడు చెన్నై తో జరిగిన మ్యాచ్ పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేం. అందుకే తన సర్జరీ ముక్కును కాపాడుకునే క్రమంలో రిషి ధావన్ పేస్ గార్డ్ తో మ్యాచ్ లో బరిలోకి దిగాడు. తాజాగా వీటికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అతడు 39 పరుగులు ఇచ్చి.. శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని లాంటి ఫామ్ లో ఉన్న బ్యాటర్ల వికెట్లను తీశాడు. ఇక చివరి ఓవర్లో బౌలింగ్ కు వచ్చి చెన్నైను కట్టడి కూడా చేశాడు. అయితే రిషి ధావన్ తన ఆటతీరుతో కంటే కూడా ఫేస్ గార్డ్ తో వైరల్ అవ్వడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, MS Dhoni, Punjab kings, Ravindra Jadeja, Shikhar Dhawan, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు