హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: అమ్మో అంత డబ్బా..! ఐపీఎల్ ద్వారా అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

IPL 2022: అమ్మో అంత డబ్బా..! ఐపీఎల్ ద్వారా అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

ఐపీఎల్ అంపైర్స్ (ఫైల్ ఫోటో)

ఐపీఎల్ అంపైర్స్ (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేసవి (Summer) కాలంలో మన ముందుకు వచ్చి ధనాధన్ ఆటతో మనల్ని అలరించే క్రికెట్ లీగ్. 2008లో అడుగు పెట్టిన ఈ లీగ్.. చిన్నా పెద్దా తేడా లేకండా అందరినీ అలరిస్తూనే ఉంది.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేసవి (Summer) కాలంలో మన ముందుకు వచ్చి ధనాధన్ ఆటతో మనల్ని అలరించే క్రికెట్ లీగ్. 2008లో అడుగు పెట్టిన ఈ లీగ్.. చిన్నా పెద్దా తేడా లేకండా అందరినీ అలరిస్తూనే ఉంది. ఇక అనామక క్రికెటర్లను వేలంలో కోటీశ్వరులను చేస్తూ.. వారిలోని ప్రతభను బయటపెడుతూ స్పాట్ ఫిక్సింగ్, కరోనా వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని నిలిచింది. ఇది ఆటగాళ్లపైనే కాదు అంపైర్ల (Umpires)పైన కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. లీగ్ లో ఆడే బడా స్టార్స్ ను పక్కన పెడితే.. మిగిలిన ప్లేయర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అంపైర్లు సంపాదిస్తున్నారంటే మీరు నమ్మగలరా. వీరు సీజన్ కు ఎంత చొప్పున సంపాదిస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అంపైరింగ్ చేసే అంపైర్లను రెండు కేటగిరీలుగా విభజించారు.  అందులో ఒక వర్గం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యులు కాగా.. మరో వర్గం డెవలప్ మెంట్ అంపైర్స్. ఎలైట్ ప్యానెల్ అంపైర్లు ఒక మ్యాచ్ కు రూ. 1.98 లక్షల (దాదాపుగా రూ. 2 లక్షలు)ను మ్యాచ్ ఫీజుగా తీసుకుంటారు. అదే డెవలప్ మెంట్ అంపైర్లు అయితూ రూ. 59 వేలను మ్యాచ్ ఫీజుగా తీసుకుంటారు. ఇక సీజన్ మొత్తానికి కలిపి రూ. 7.33 లక్షలను స్పాన్సర్ షిప్ (అంపైర్తు ధరించే డ్రెస్ పై ఉన్న స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం) అమౌంట్ గా స్వీకరిస్తారు. ఈ సీజన్ లో మొత్తం 15 మంది అంపైర్లు గా పని చేస్తున్నారు. ఇందులో 12 మంది భారత దేశానికి చెందిన అంపైర్లు కాగా మరో ముగ్గురు విదేశీయులు.

ఇది కూడా చదవండి : విచిత్రమైన స్థితిలో ముంబై.. ఒక వైపేమో ఘనమైన రికార్డు.. మరోవైపేమో అత్యంత..

ప్రతి మ్యాచ్ కు కూడా ఇద్దరు ఆన్ ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్ పని చేయాల్సి ఉంటుంది. అంటే ఒక మ్యాచ్ కు నలుగురు అంపైర్లు పని చేస్తారన్నమాట. ఐపీఎల్ మొత్తం 70 లీగ్ మ్యాచ్ లతో పాటు మరో నాలుగు ప్లే ఆఫ్స్ (ఫైనల్ తో కలిపి) జరగనున్నాయి. అంటే ఈ లెక్కన ఒక్కో అంపైర్ కనీసం.. 20 నుంచి 25 మ్యాచ్ లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. దాంతో ఒక్కో ఎలైట్ అంపైర్ రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఐపీఎల్ ద్వారా ఆర్జించే అవకాశం ఉంది. అదే సమయంలో స్పాన్సర్ షిప్ అమౌంట్ ను కూడా కలుపుకుంటే ఈ  ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. వీరి ఆదాయం లక్నో జట్టు ప్లేయర్ ఆయుశ్ బదోని, ముంబై టీం ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ కంటే కూడా ఎక్కువగా ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి : గంటకు 175 కి.మీ వేగంతో బౌలింగ్.. ఈ బేబీ మలింగ దెబ్బకు ప్రత్యర్థుల ఫ్యూజులు ఎగరడం ఖాయం..

లీగ్ లో ఉన్న భారత అంపైర్లు

అనిల్ చౌదరి, శంషుద్దీన్, వీరేందర్ శర్మ, అనంత పద్మనాభన్, నితిన్ మీనన్, ఎస్ రవి, వినీత్ కులకర్ణి, యశ్వంత్, ఉల్హాస్ గాంధే, అనిల్, శ్రీనివాసన్, పాఠక్

విదేశీ అంపైర్లు

రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, పాల్ రిఫెల్, క్రిస్ గఫానీ

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు