IPL 2022 IPL VIRAL NEWS CSK LATEST NEWS IS MATHEESHA PATHIRANA REALLY BOWLED 175 KM PER HOUR BALL IN UNDER 19 WORLD CUP SJN
IPL 2022: గంటకు 175 కి.మీ వేగంతో బౌలింగ్.. ఈ బేబీ మలింగ దెబ్బకు ప్రత్యర్థుల ఫ్యూజులు ఎగరడం ఖాయం..
మతీశ పతిరణ (PC: TWITTER)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నిప్పులు చెరగడానికి మరో స్పీడ్ స్టర్ రెడీ అయ్యాడు. తొలుత ఐపీఎల్ కు ఎంపిక అవ్వకపోయినా.. గాయపడ్డ ఓ ఆటగాడిని భర్తీ చేస్తూ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ శ్రీలంకకు చెందిన బేబీ మలింగ. శ్రీలంక (Sri lanka)కు చెందిన 19 ఏళ్ల మతీశ పతిరణ (matheesha pathirana) అచ్చం మలింగ యాక్షన్ తో బౌలింగ్ చేయగలడు.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నిప్పులు చెరగడానికి మరో స్పీడ్ స్టర్ రెడీ అయ్యాడు. తొలుత ఐపీఎల్ కు ఎంపిక అవ్వకపోయినా.. గాయపడ్డ ఓ ఆటగాడిని భర్తీ చేస్తూ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ శ్రీలంకకు చెందిన బేబీ మలింగ. శ్రీలంక (Sri lanka)కు చెందిన 19 ఏళ్ల మతీశ పతిరణ (matheesha pathirana) అచ్చం మలింగ యాక్షన్ తో బౌలింగ్ చేయగలడు .దాంతో అతడిని బేబే మలింగ, జూనియర్ మలింగ అంటూ శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్ పిలుస్తుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) బౌలర్ ఆడమ్ మిల్నే తొడ కండరాల గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతడి స్థానంలో పతిరణను తీసుకుంటూ చెన్నై నిర్ణయం తీసుకుంది.
ఇతడిని బేస్ ప్రైజ్ రూ. 20లక్షలకు చెన్నై తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పతిరణ.. త్వరలోనే జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక పతిరణ విషయానిక వస్తే.. ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో శ్రీలంక తరఫున ఆడాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు తీశాడు. క్యాండీతో జరిగిన మ్యాచ్లో 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన మహిష వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ వేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ.. ఇప్పుడు అతను ప్రత్యామ్నాయంగా CSKలోకి ప్రవేశించాడు.
ఈ ఏడాది జరిగిన అండర్ 19 ప్రపంచకప్ తో పాటు 2020లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో కూడా అతడు పాల్గొన్నాడు. అందులో ఇండియా (India)తో జరిగిన మ్యాచ్ లో 175 కి.మీ వేగంతో బౌలింగ్ చేసినట్లు స్కోరు బోర్డుపై ప్రత్యక్షమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్ గా పాకిస్తాన్ దిగ్గజం షోయబ్ అక్తర్ పేరిట ఉంది. అతడు గంటకు 161 కి.మీ వేగంతో ఆ బంతిని వేశాడు. అయితే పతిరణను షోయబ్ అక్తర్ బాబు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు.
Matheesha Pathirana replaces Adam Milne. It's all over for Ferguson and Umran Malik. Swiggy shaking right now. pic.twitter.com/NR4ffRhtzT
అయితే పతిరణ 175 కి.మీ వేగంతో బంతిని వేయలేదు. అండర్ 19 టోర్నీలో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పతిరణ 175 కి.మీ వేగంతో వేసినట్లు స్పీడోమీటర్ కొలిచింది. అయితే సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యల కారణంగా 175 కి.మీ వేగం అంటూ చూపినట్లు అనంతరం ఐసీసీ పేర్కొంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.