IPL 2022 IPL VIRAL NEWS CSK CAPTAIN RAVINDRA JADEJA BOWS DOWN TO MS DHONI AFTER A THRILLING VICTORY OVER MUMBAI INDIANS IN IPL 2022 SJN
IPL 2022: ధోని ఫినిషింగ్ కు జడేజా అదిరే రియాక్షన్.. ఏకంగా కాళ్లపై.. అదే దారిలో అంబటి రాయుడు..
Photo Credit : IPL Twitter
IPL 2022: చాలా రోజుల తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రెచ్చిపోయాడు. గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) దిగ్గజం మహేంద్రుడు తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు.
IPL 2022: చాలా రోజుల తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రెచ్చిపోయాడు. గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) దిగ్గజం మహేంద్రుడు తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో.. చెన్నై విజయం సాధించాలంటే చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే రాగా.. ఆఖరి నాలుగు బంతులను వరుసగా 6, 4, 2, 4 కొట్టిన ధోని చెన్నైకు అద్భుత విజయాన్ని అందించాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ద్వారా వింటేజ్ ధోనిని అతడి అభిమానులకు పరిచయం చేశాడు.
156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ను ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో 19 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 139/6గా నిలిచింది. చివరి ఓవర్లో చెన్నై విజయం సాధించాలంటూ 17 పరుగులు అవసరం అయ్యాయి. బౌలింగ్ కు వచ్చిన ఉనాద్కట్ తొలి బంతికే ప్రిటోరియస్ ను ఎల్బీగా అవుట్ చేశాడు. రెండో బంతికి బ్రావో సింగిల్ తీసి ధోనికి స్ట్రయిక్ ఇచ్చాడు. పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో బంతిని మిడిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అయితే ధోని తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మూడో బంతిని భారీ సిక్సర్ బాాదాడు. ఈ తర్వాత బంతిని ఫోర్ కొట్టాడు. దాంతో చెన్నై విజయ సమీకరణం రెండు బంతుల్లో 6 పరుగులుగా నిలిచింది. ఐదో బంతికి ధోని రెండు పరుగులు తీయడంతో.. మ్యాచ్ ఆఖరి బంతికి వెళ్లింది. చెన్నై గెలవాలంటే ఆఖరి బంతికి ఫోర్ కొట్టాల్సిన స్థితిలో ధోని ఎటువంటి తప్పు చేయకుండా బౌండరీ బాదాడు. దాంతో చెన్నై సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ముగిశాక జడేజా.. ధోని ముందు ’వాట్ ఏ ఇన్నింగ్స్ టేక్ ఏ బౌ‘ అన్నట్లు మోకరిల్లాడు. అతడి వెనుకే ఉన్న అంబటి రాయుడు సైతం ధోనికి నమస్కారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
156 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో, ముంబై పరుగుల తేడాతో ఫస్ట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై బ్యాటర్లలో అంబటి రాయుడు (35 బంతుల్లో 40 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప ( 25 బంతుల్లో 30 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రిటోరియస్ ( 14 బంతుల్లో 22 పరుగులు) రాణించారు. డానియల్ సామ్స్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అంతకుముందు ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ ( 43 బంతుల్లో 51 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ గా రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ (21 బంతుల్లో 32 పరుగులు; 3 ఫోర్లు, 1 సిక్సర్), హృతిక్ సోకిన్ (25 బంతుల్లో 25 పరుగులు ; 3 ఫోర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. బ్రావో రెండు వికెట్లతో సత్తా చాటాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.