హోమ్ /వార్తలు /క్రీడలు /

IPl 2022: ఢిల్లీ వద్దనుకుంది.. లక్నో నెత్తిన పెట్టుకుంది.. ఎవరీ ఆయుశ్ బదోని.. అతడికి గంభీర్ తో సంబంధం ఏంటి?

IPl 2022: ఢిల్లీ వద్దనుకుంది.. లక్నో నెత్తిన పెట్టుకుంది.. ఎవరీ ఆయుశ్ బదోని.. అతడికి గంభీర్ తో సంబంధం ఏంటి?

ఆయుశ్ బదోని (PC: IPL)

ఆయుశ్ బదోని (PC: IPL)

IPL 2022: ఆయుశ్ బదోని... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్రస్తుతం ఇతడో సంచలనం. ఒక్క మ్యాచ్ తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ హోదా పొందేశాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ లో బదోని... లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) కు ప్రాతినిధ్యం వహించాడు.

ఇంకా చదవండి ...

IPl 2022: ఆయుశ్ బదోని... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ప్రస్తుతం ఇతడో సంచలనం. ఒక్క మ్యాచ్ తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ హోదా పొందేశాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ లో బదోని... లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) కు ప్రాతినిధ్యం వహించాడు. లక్నో సూపర్ స్టార్స్ అనుకున్న కేఎల్ రాహుల్ (KL Rahul), క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, ఎవిన్ లూయిస్ లాంటి ప్లేయర్స్ పెవిలియన్ కు క్యూ కట్టిన వేళ... 22 ఏళ్ల బదోని తన బ్యాట్ తో సత్తా చాటాడు. మొహమ్మద్ షమీ బౌలింగ్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు క్రీజులో నిలబడ్డానికే భయపడుతుంటే... బదోని మాత్రం వీరోచిత పోరాటంతో మెరిశాడు.  కృనాల్ పాండ్యా లాంటి ప్లేయర్ ను కాదని  బదోనిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపిందంటే అతడిపై లక్నో మేనేజ్ మెంట్ కు ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది.

తొలుత ఆచితూచి ఆడిన బదోని అనంతరం చెలరేగిపోయాడు. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ బౌలింగ్ లో స్లాగ్ స్వీప్స్ చేస్తూ సిక్సర్ బాదాడు. అంతేకాకుండా 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తోన్న లూకీ ఫెర్గూసన్ బౌలింగ్ లోనూ సిక్సర్ బాాదాడు. 54 పరుగులతో చివర్లో అవుటయ్యాడు. బదోని, దీపక్ హుడాల పోరాటంతో లక్నో టీం గుజరాత్ ముందు చెప్పుకోదగ్గ టార్గెట్ ను ఉంచగలిగింది. మ్యాచ్ పూర్తయ్యాక జరిగిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో హర్ష బోగ్లే... ’ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నావ్?‘ అంటూ బదోనిని ప్రశ్నించాడు. అవును నిజమే... ఇంతటి ట్యాలెంట్ పెట్టుకొని ఇన్నేళ్లు బదోని ఎక్కడున్నట్లు

ఎవరీ బదోని

బదోని ఢిల్లీ వాసి.  అందరిలాగే క్రికెట్ పై మక్కువతో దాన్నే కెరీర్ గా ఎంచుకున్నాడు. అయితే అతడిలోని ట్యాలెంట్ ను గుర్తించింది మాత్రం భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్. బదోని భారత్  అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శ్రీలంకతో జరిగిన యూత్ టెస్టు మ్యాచ్ లో చెలరేగిపోయాడు, 185 పరుగులు కూడా చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో అయితే 28 బంతుల్ల ో52 పరుగులు చేసి తన పవర్ ఏంటో చూపించాడు. దాంతో అతడికి గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆడే  ఢిల్లీ జట్టులో చోటు దక్కింది. అయితే ఆ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతడు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.

' isDesktop="true" id="1250666" youtubeid="T20DRSrqj84" category="sports">

ఇక గత నెలలో జరిగిన మెగా వేలంలో బదోనిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సుముఖత వ్యక్తం చేయకపోయినా... లక్నో సూపర్ జెయింట్స్ టీం అతడిని రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఇందుకు కారణం గౌతం గంభీర్. లక్నో టీం మెంటార్ గా గంభీర్ ఉన్నాడు. ఇదే విషయాన్ని బదోని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు అన్ని వేళలా అండగా ఉంటానని గంభీర్ మాటిచ్చినట్లు బదోని పేర్కొన్నాడు. ఆట మీద మనసు పెట్టు.. నిన్ను నేను బ్యాకప్ చేస్తా‘ అని గంభీర్ తనకు చెప్పినట్లు బదోని పేర్కొన్నాడు. ఐపీఎల్ ముందు సన్నాహక శిబిరాల్లో భాగంగా జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లోనూ బదోని అర్ధ సెంచరీలతో చెలరేగాడు. మ్యాచ్ లో బదోని బ్యాటింగ్ విన్యాసాలు చూసిన వారు... అతడిని ఇండియన్ డీవిలియర్స్ గా పేర్కొనడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gautam Gambhir, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants

ఉత్తమ కథలు