IPL 2022 IPL UPDATES SUNRISERS HYDERABAD BOWLER T NATARAJAN BREAKS STUMP WITH HIS BOWLING AT NET PRACTICE SJN
IPL 2022: డేల్ స్టెయిన్ అలా వచ్చాడో లేదో... వికెట్లు విరగ్గొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్
నటరాజన్
IPL 2022: గత నెలలో జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ టీం అతడిని రూ. 4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి ఫిట్ నెస్ లేని నటరాజన్ పై అంత మొత్తం వెచ్చించడమా... అసలు హైదరాబాాద్ కు బుర్ర ఉందా? అంటూ అభిమానులు అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ లో నటరాజన్ దుమ్ము దులుపుతున్నాడు.
IPL 2022: ధనాధన్ లీగ్ ఇండియన్ పీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లన్నీ మహారాష్ట్ర (Maharashtra) వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ లను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై బీసీసీఐ (BCCI) త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇక ఐపీఎల్ లో పాల్గొనే జట్లన్నీ ఇప్పటికే ముంబై (Mumbai) చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అదే సమయంలో గతేడాది ఎదురైన దారుణ పరాభం నుంచి తేరుకొని ఈ సీజన్ లో రాణించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers hyderabad) జట్టు భావిస్తోంది. అయితే వేలంలో సన్ రైజర్స్ వ్యవహరించిన తీరు అభిమానులకు కోపం తెప్పించినా... మెల్లగా అంతా సర్దుకుంటుందని టీం మేనేజ్ మెంట్ భావిస్తోంది
ఇక ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్, టి. నటరాజన్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ వంటి ప్లేయర్లను సన్ రైజర్స్ మళ్లీ సొంతం చేసుకుంది. 2020 సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన నటరాజన్... అనంతరం ఆస్ట్రేలియా లో పర్యటించిన టీమిండియాకు ఎంపికయ్యాడు. అక్కడ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. అయితే అనంతరం అతడు గాయాల బారిన పడ్డాడు. దాంతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ కేవలం రెండు మ్యాచ్ లే ఆడాడు. అయితే గత నెలలో జరిగిన మెగా వేలంలో సన్ రైజర్స్ టీం అతడిని రూ. 4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి ఫిట్ నెస్ లేని నటరాజన్ పై అంత మొత్తం వెచ్చించడమా... అసలు హైదరాబాాద్ కు బుర్ర ఉందా? అంటూ అభిమానులు అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ సెషన్ లో నటరాజన్ దుమ్ము దులుపుతున్నాడు.
తాజాగా నటరాజన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో నటరాజన్ వేసిన ఓ బంతి ఏకంగా వికెట్ ను రెండు ముక్కలు చేసింది. ఈ వీడియోను చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు నట్టూ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అదే సమయంలో ఇదంతా డేల్ స్టెయిన్ మహిమ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ కు ముందు కోచ్ విభాగంలో సన్ రైజర్స్ భారీ మార్పులను చేసింది. మెంటార్ గా ఉన్న టామ్ మూడీని మళ్లీ హెడ్ కోచ్ గా నియమించింది. అదే సమయంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారానా బ్యాటింగ్ కోచ్ గా... సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.