Home /News /sports /

IPL 2022 IPL UPDATES SHIVAM MAVI BANUKA RAJAPAKSA CLASH AT IPL 2022 REMEBER 1996 WORLD CUP CLASH BETWEEN VENKATESH PRASAD AND AAMER SOHAIL SJN

IPL 2022: 1996 ప్రపంచకప్ జగడాన్ని మరోసారి గుర్తు చేసిన రాజపక్స, శివమ్ మావి

బానుక రాజపక్స్, శివమ్ మావి (PC: IPL)

బానుక రాజపక్స్, శివమ్ మావి (PC: IPL)

IPL 2022: పంజాబ్ ఆటగాడు భానుక రాజపక్స, కోల్ కతా బౌలర్ శివమ్ మావి మధ్య జరిగిన వార్ అందరినీ ఆకట్టుకుంది. అచ్చం 1996 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహైల్, భారత బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ల జగడాన్ని గుర్తు చేసినట్లు అయ్యింది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా... అందులో పంజాబ్ ఆటగాడు భానుక రాజపక్స, కోల్ కతా బౌలర్ శివమ్ మావి మధ్య జరిగిన వార్ అందరినీ ఆకట్టుకుంది. అచ్చం 1996 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహైల్, భారత బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ల జగడాన్ని గుర్తు చేసినట్లు అయ్యింది. ప్రపంచకప్ లో లాగా ఇక్కడ ఒకరిని ఒకరు దూషించుకోకపోయినా... ఆ ఓవర్ జరిగిన తీరు మాత్రం 1996 ప్రపంచకప్ లో జరిగిన పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ను గుర్తు చేయక మానదు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు  ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మయాంక్ తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో... శ్రీలంక ప్లేయర్ భానుక రాజపక్స వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. నాలుగో ఓవర్ వేయడానికి శివమ్ మావీ రాగా... భానుక తొలి బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాది హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అయితే మావీ తన తర్వాతి బంతితోనే కమ్ బ్యాక్ చేశాడు. షార్ట్ పిచ్ బాల్ ను వికెట్లకు దూరంగా వేయగా... రాజపక్స ఆ బంతిని ఆడటంలో తడబడ్డాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి మిడాన్ లో సౌతీ చేతికి చిక్కింది. దాంతో తన బౌలింగ్ లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ రాజపక్స ను అవుట్ చేసి మావీ పగ తీర్చుకున్నాడు.

1996 ప్రపంచకప్ లో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన సోహైల్... ’నువ్వు వేసే ప్రతి బంతి కూడా బౌండరీ వెళ్తుంది‘ అంటూ వెంకటేశ్ ప్రసాద్ కు వార్నింగ్ ఇస్తాడు. వెంకటేశ్ ప్రసాద్ ఏమన్నా మామూలోడా... తన తర్వాతి బంతికే అతడిని క్లీన్ బౌల్డ్ చేసి... ’ఇక ఆడింది చాలు లే... పెవిలియన్ కు దారి అటు... వెళ్లు‘ అంటూ డగౌట్ దారిని చూపిస్తాడు. ఆ మ్యాచ్ కు ఈ ఏడాదితో 26 ఏళ్లు కావొస్తున్నా... టీవీలో, యూ ట్యూబ్, వేరే ఎక్కడైనా సరే ఈ సంఘటనను చూస్తే ఇప్పటికీ రోమాలు నిక్క బొడుచుకోవడం ఖాయం.

ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఉంచిన 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి పూర్తి చేసింది. దాంతో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమి నుంచి కేకేఆర్ తొందరగానే తేరుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India VS Pakistan, IPL, IPL 2022, Kolkata Knight Riders, Punjab kings, Shreyas Iyer, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు