హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: అందరూ మ్యాచ్ విన్నర్లే.. పేపర్ పై బలంగా కనిపిస్తోన్న పంజాబ్ కింగ్స్ ఈసారైన తన రాతను మార్చుకోగలదా?

IPL 2022: అందరూ మ్యాచ్ విన్నర్లే.. పేపర్ పై బలంగా కనిపిస్తోన్న పంజాబ్ కింగ్స్ ఈసారైన తన రాతను మార్చుకోగలదా?

పంజాబ్ కింగ్స్ (ఫైల్ ఫోటో)

పంజాబ్ కింగ్స్ (ఫైల్ ఫోటో)

IPL 2022: స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 14 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో అందరిదీ ఒక కథ అయితే పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అలియాస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ది మరో కథ. బాలీవుడ్ (Bollywood) స్టార్ ప్రీతి జింతా (preity zinta) పంజాబ్ కింగ్స్ ఓనర్లలో ఒకరు కావడంతో ఐపీఎల్ తొలి సీజన్ నుంచే ఆ జట్టుకు కావల్సినంత గ్లామర్ వచ్చేసింది. ఆరంభ సీజన్ లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నాయత్వంలోని ఆ జట్టు సెమీఫైనల్ వరకు చేరి ఫర్వాలేదనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి పంజాబ్ ఆటతీరు గాడి తప్పింది. బలమైన టీంగా సీజన్ లో బరిలోకి దిగడం పేలవ ప్రదర్శనతో చతికిల పడటం. ఒకరకంగా చెప్పాలంటే ప్రతి సీజన్ లోనూ (2008, 2014 సీజన్లు మినహా) పంజాబ్ చివరి రెండు స్థానాల కోసం పోటీ పడేది. 2014లో మ్యాక్స్ వెల్ పుణ్యమా అని ఫైనల్ వరకు చేరినా... ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) చేతిలో ఆఖరి ఓవర్లో ఓడి తొలి టైటిల్ ను అందుకోలేకపోయింది. 2015 నుంచి గత సీజన్ వరకు కూడా ఆ జట్టు కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేకపోయింది. అనిల్ కుంబ్లే లాంటి కోచ్ ఉన్నా ఆ జట్టు తలరాత మారకపోవడం విశేషం. అయితే 2022 సీజన్ ముందర జట్టు రూపురేఖలు మారిపోయాయి. కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ 2022 సీజన్ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 14 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ టైటిల్ గెలవలేకపోయింది. ఆటగాళ్లు మారినా, కెప్టెన్లు, కోచ్‌లు మళ్లీ మళ్లీ మారినా... టీమ్‌ జెర్సీ రూపురేఖలు మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారలేదు. అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత ప్రదర్శనల మెరుపులు తప్ప ఒక జట్టుగా పంజాబ్‌ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. గత సీజన్ 'ఎలెవన్‌'ను పక్కన పడేసి టీమ్‌ పేరులో స్వల్ప మార్పుతో 'కింగ్స్‌'గా బరిలోకి దిగినా ఆ జట్టుకు కలిసి రాలేదు. సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ ఆడిన చరిత్ర పంజాబ్‌ది. అయినా పాపం ఇంత వరకు టైటిల్ నెగ్గలేదు.

కేఎల్ రాహుల్, షారూఖ్, రవి బిష్ణోయ్ వంటి తమ మాజీ ఆటగాళ్లు వేలంలోకి వెళ్తామని పట్టుబట్టడంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దాంతో పంజాబ్ వేలంలో రూ.72 కోట్లతో రిచెస్ట్ ఫ్రాంచైజీగా పాల్గొంది. గతంలో కూడా భారీ డబ్బుతో వేలంలో పాల్గొన్న పంజాబ్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం మంచి టీమ్‌ను సెలెక్ట్ చేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు మొదటి తుది జట్టు అద్భుతంగా ఉంది. కానీ బ్యాకప్ ఆప్షనే బాలేదు. లియాన్ లివింగ్ స్టోన్(రూ.11.5 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ. 6.75 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), కగిసో రబడ(రూ.9.25 కోట్లు)ల కోసం పంజాబ్ బాగా ఖర్చు పెట్టింది. ఎక్కువ అనామక ఆటగాళ్లను తీసుకోవడంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ మంచి ఇండియన్ బ్యాట్స్‌మన్ , ఫారిన్ బౌలర్ మిస్సైనట్లు అనిపిస్తోంది. క్వాలిటీ, ఎక్సైటింగ్ ఆల్‌రౌండర్ కూడా లేకపోవడం ఆ జట్టు బలహీనతగా చెప్పుకోవచ్చు.

2008 లో ప్రారంభించబడిన ఈ జట్టుకు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింతా, కరణ్ పాల్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టు మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి స్వంత మైదానం. 2010 నుంచి ఈ జట్టు తమ స్వంత మైదానంలో ఆడాల్సిన ఆటలను ధర్మశాలలోని HPCA స్టేడియం లేదా, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో కూడా ఆడుతూ వస్తోంది.

పంజాబ్ పూర్తి జట్టు ఇదే..

మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75 కోట్లు), ఓడిన్ స్మిత్(రూ.6 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్(రూ.40 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రేరక్ మన్కండ్(రూ.20 లక్షలు), అథర్వ టైడ్(రూ.20 లక్షలు), వ్రిట్టిక్ చటర్జీ(రూ.20 లక్షలు), బాల్‌తేజ్ ధండా(రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు)

First published:

Tags: IPL, IPL 2022, Kolkata Knight Riders, Punjab kings

ఉత్తమ కథలు