Home /News /sports /

IPL 2022 IPL UPDATES PUNJAB KINGS BOWLER KAGISO RABADA TAKES 5 WICKETS AGAINST BANGLADESH IN 2ND ODI SJN

IPL 2022: రబడను చూసి మురిసిపోతున్న పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా... కారణం ఏంటంటే?

ప్రీతి జింతా (ఫైల్ ఫోటో)

ప్రీతి జింతా (ఫైల్ ఫోటో)

IPL 2022: . గత 14 సీజన్లలో కేవలం రెండు సీజన్లు (2008, 2014) మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ పంజాబ్ జట్లు ఘోరంగా విఫలమైంది. దాంతో ఈసారి జరిగే ఐపీఎల్ లో బాగా రాణించాలని పట్టుదలగా ఉంది. అందుకే గత నెలలో జరిగిన వేలంలో చాలా నేర్పుగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇంకా చదవండి ...
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొత్త సీజన్ సరికొత్తగా ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. వారం కంటే తక్కువ రోజుల్లో ముంబై (Mumbai)లోని విఖ్యాత స్టేడియం వాంఖడే లో ఈ నెల 26న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి పోరు గత సీజన్ ఫైనలిస్టులు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్లు కూడా ముంబై చేరుకుని ఇప్పటికే తమ ప్రాక్టీస్ ను మొదలు పెట్టేశాయి కూడా.  కరోనా వల్ల ఐపీఎల్ 15వ సీజన్ మొత్తం కూడా మహారాష్ట్ర వేదికగానే జరగనుంది.

గత నెలలో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ కగిసో రబడ (kagiso rabada)ను పంజాబ్ కింగ్స్ (punjab kings) భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. దాదాపు అతడి కోసం పంజాబ్ రూ. 9.25 కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ లో రబడ తన దేశం దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో రబడ రెచ్చిపోయాడు. ఏకంగా 5 వికెట్లతో మెరిశాడు. ఇప్పుడు ఇదే పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా (preity zinta) మొహంలో ఆనందానికి కారణం అవుతోంది. గత 14 సీజన్లలో కేవలం రెండు సీజన్లు (2008, 2014) మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ పంజాబ్ జట్లు ఘోరంగా విఫలమైంది. దాంతో ఈసారి జరిగే ఐపీఎల్ లో బాగా రాణించాలని పట్టుదలగా ఉంది. అందుకే గత నెలలో జరిగిన వేలంలో చాలా నేర్పుగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇక రబడ ఇప్పుడు ఐదు వికెట్లతో తన ఫామ్ ను చాటడం పంజాబ్ కింగ్స్ కు సానుకూల అంశం. ఆరంభంలో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో రబడ దిట్ట. ఐపీఎల్ 15వ సీజన్ లో నైనా పంజాబ్ కింగ్స్ తమ తొలి ఐపీఎల్ టైటిల్ ను నెగ్గి సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా కలను నెరవేరుస్తుందో లేదో చూడాలి.

ఇక తొలి వన్డేలో ఎదురైన పరాభవం నుంచి దక్షిణాఫ్రికా జట్టు తేరుకుంది. రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అఫీఫ్ హొసైన్ (107 బంతుల్లో 72; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. రబడ కేవలం 32 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా జట్టు 37.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆటతో అలరించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, Preity zinta, Punjab kings

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు