Home /News /sports /

IPL 2022 IPL UPDATES PUNJAB KINGS BEATS ROYAL CHALLENGERS BANGLORE BY 5 WICKETS SJN

IPL 2022: ఒడెన్ స్మిత్ మెరుపులు... ఉత్కంఠ పోరులో బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ విజయం

పంజాబ్ కింగ్స్ (PC: IPL)

పంజాబ్ కింగ్స్ (PC: IPL)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore)కు చుక్కెదురైంది. 205 పరుగులు చేసినా పేలవ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore)కు చుక్కెదురైంది. 205 పరుగులు చేసినా పేలవ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఓటమి ఖాయమనుకున్న చోటు పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ ఒడెన్ స్మిత్ (8 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. దాంతో 206 పరుగుల లక్ష్యాన్ని కూడా పంజాబ్ కింగ్స్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ (punjab kings) 19 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగులు చేసింది.  డు ప్లెసిస్ 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉండటం విశేషం. ఇతడికి విరాట్ కోహ్లీ (Virat Kohli) (29 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, సిక్సర్లు) ఇన్నింగ్స్ కూడా తోడవ్వడంతో పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) భారీ స్కోరును సాధించింది. 20 ఓవర్లలో బెంగళూరు  2 వికెట్లకు 205 పరుగులు చేసింది. డు ప్లెసిస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో బెంగళూరు భారీ స్కోెరును అందుకుంది.
 అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్)లు శుభారంభం చేశారు. వీరు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ జట్టు ఛేదన సాఫీగా సాగింది. మయాంక్ అవుటయ్యాక వచ్చిన భానుక రాజపక్స (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అయితే బౌలింగ్ క వచ్చిన సిరాజ్ వరుస బంతుల్లో రాజపక్స, రాజ్ బవ వికెట్లను తీశాడు. దాంతో పంజాబ్ కష్టాల్లో పడింది. చూస్తుండగానే... రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోయింది. అయితే ఈ దశలో ఒడెన్ స్మిత్ అదరగొట్టడంతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది.



టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఎంత తప్పో అతడికి తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లుగా డు ప్లెసిస్, అనుజ్ రావత్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చారు. తొలుత వీరు ఆచి తూచి ఆడారు. దాంతో స్కోరు బోర్డు నెమ్మదిగానే పరుగెత్తింది. అనుజ్ రావత్ కుదురుకున్నాడనే సమయంలో రాహుల్ చహర్ అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో 50 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ ను కోల్పోయింది.

ఈ దశలో జత కలిసిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పటి వరకు టెస్టు మ్యాచ్ లెవల్లో 30 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన డు ప్లెసిస్... ఇక్కడి నుంచి చెలరేగిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపించేశాడు. ఇక్కడి నుంచి అతడు అవుటయ్యేంతవరకు కూడా 27 బంతులను ఎదుర్కొన్న డు ప్లెసిస్... ఏకంగా 71 పరుగుల చేశాడు. అయితే సెంచరీ ముంగిట భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న కోహ్లీ డు ప్లెసిస్ కు చక్కగా సహకరించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. వీరు రెండో వికెట్ కు 118 పరుగులు జోడించడం విశేషం.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, IPL, IPL 2022, Mohammed Siraj, Punjab kings, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు