IPL 2022 IPL UPDATES LUCKNOW SUPERGIANTS ROPED BLESSING MUZARABANI AS MARK WOOD REPLACEMEN IN IPL SJN
IPl 2022: చరిత్ర సృష్టించిన జింబాబ్వే బౌలర్... మార్క్ వుడ్ స్థానంలో ఐపీఎల్ బరిలో
ముజరబాని (PC: TWITTER)
IPL 2022: జింబాబ్వే క్రికెట్ జట్టు పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని ( Blessing Muzarabani) చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ లో అతడు బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఆడనున్న రెండో జింబాబ్వే బౌలర్ గా ముజరబాని ఘనతకెక్కాడు.
IPl 2022: జింబాబ్వే క్రికెట్ జట్టు పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని ( Blessing Muzarabani) చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్ లో అతడు బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఆడనున్న రెండో జింబాబ్వే బౌలర్ గా ముజరబాని ఘనతకెక్కాడు. 2014లో జింబేబ్వే మాజీ సారథి బ్రెండన్ టేలర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వేలంలో రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. భుజం గాయంతో ఇంగ్లండ్ (England) క్రికెట్ జట్టు బౌలర్ మార్క్ వుడ్ (Mark wood) ఐపీఎల్ తాజా సీజన్ కు దూరమైన సంగతి తెలిసిందే. అతడిని గత నెలల ోజరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ 7.5 కోట్లకు సొంతం చేసుకుంది. అయతే అతడు గాయంతో సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గాయంతో దూరమైన ఆటగాడిని ఆ జట్టు మరో ఆటగాడితో భర్తీ చేసేందుకు వీలు ఉంటుంది.
మార్క్ వుడ్ విదేశీ ప్లేయర్ల జాబితాలోకి వస్తాడు కాబట్టి అతడిని మరో విదేశీ ప్లేయర్ తోనే భర్తీ చేసుకుందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్నో టీం ఎవరూ ఊహించని విధంగా జింబాబ్వే టీం పేసర్ ముజరబానితో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి లక్నో జట్టు బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్ ను మార్క్ వుడ్ స్థానంలో తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టస్కిన్ అహ్మద్ కు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఫలితంగా లక్నో ముజరబానిని తీసుకుంది.
Ambassador met with Mr Blessing Muzarabani, the Zimbabwean bowler, as he prepared to leave for #IPL2022.
ఈ మేరకు జింబాబ్వేలోని భారత రాయబారి ముజరబానికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఐపీఎల్ లో అతడు సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీలో ముజరబాని ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడాడు. ఏడు మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక దేశం తరఫున 21 మ్యాచ్ ల్లో 25 వికెట్లు తీశాడు. ఆరడుగులకు పైగా ఎత్తుండే ముజరబాని వేరియేషన్స్ తో బంతులను వేయగలడు. అంతేకాకుండా అతడి బౌలింగ్ ను భారత్ తో పాటు ఇంగ్లండ్ ,ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ చాలా తక్కువగా ఆడటంతో ముజరబాని బంతులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ముజరబానిని ఎంత ధరకు తీసుకన్నారనే విషయంపై స్పష్టత లేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.