హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: వేలంలో చూపిన తెగువను మైదానంలో చూపగలదా..? లక్నో భారమంతా వారిద్దరి పైనే...

IPL 2022: వేలంలో చూపిన తెగువను మైదానంలో చూపగలదా..? లక్నో భారమంతా వారిద్దరి పైనే...

లక్నో టీం (PC: LSG TWITTER)

లక్నో టీం (PC: LSG TWITTER)

IPL 2022: మెగా వేలంలో లక్నో దూకుడు క‌న‌బ‌రిచింది. విశ్లేష‌కుల‌తోపాటు అభిమానుల నుంచి మంచి ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. 21 మంది ఆటగాళ్లను సిద్దం చేసుకున్న జట్టు..యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సవాల్ విసురుతోంది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా రెండు జ‌ట్లు ప్ర‌వేశించాయి. అందులో ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) కాగా, మ‌రో జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans). దీంతో ఈ రెండు టీంలు లీగ్‌లో ఎలా ఆడ‌తాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ముగిసిన మెగా వేలంలో లక్నో దూకుడు క‌న‌బ‌రిచింది. విశ్లేష‌కుల‌తోపాటు అభిమానుల నుంచి మంచి ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. 21 మంది ఆటగాళ్లను సిద్దం చేసుకున్న జట్టు..యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో సవాల్ విసురుతోంది. 59 కోట్ల మూలధనంతో వేలంలో ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు తొలిరోజే దూకుడుగా వ్యవహరించి..52 కోట్లతో కీలక ఆటగాళ్లను చేజిక్కించుకుంది. ఆ తరువాత రెండవరోజు ఇంకొంతమంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది.

వేలానికి ముందు ఎంపిక అదుర్స్

కొత్త జట్టు కాబట్టి ఆటగాళ్లను రీటెయిన్ చేసుకునే అవకాశం లక్నో జట్టుకు లేదు. అయితే మిగిలిన ఎనిమిది జట్లు విడుదల చేసిన ఆటగాళ్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేసుకునే వీలును బీసీసీఐ కొత్త జట్లు అయిన లక్నో, గుజరాత్ లకు కల్పించింది. ఇక్కడ చాకచక్యంగా వ్యవహరించిన లక్నో కేఎల్ రాహుల్, ర‌వి బిష్ణోయ్‌, స్టోయినీస్‌ లను ఎంపిక చేసుకుంది. కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలను ఎంపిక చేసింది. అనంతరం వేలంలోనూ దూకుడు క‌న‌బ‌రిచి స్టార్ ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకుంది.  అత్య‌ధికంగా యువ బౌల‌ర్ ఆవేశ్ ఖాన్‌ను ఆ జ‌ట్టు 10 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌ను 8 కోట్ల 75 లక్ష‌ల‌కు, టీమిండియా ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాను 8 కోట్ల 25 లక్ష‌ల‌కు ద‌క్కించుకుంది. ఇంగ్లండ్ ఆట‌గాడు మార్క్‌వుడ్‌ను 7 కోట్ల 50 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నా అతడు ఇప్పుడు గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడి స్థానాన్ని ఎవరికీ ఊహకందకుండా జింబాబ్వే ప్లేయర్ బ్లెస్సింగ్ ముజరబానితో భర్తీ చేసింది. దీప‌క్ హుడాకు రూ.5.75 కోట్లు, మ‌నీష్ పాండేకు రూ. 4.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ స్టొయినస్ లు జట్టుకు కీలకం కానున్నారు.

సమతూకంగా

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు ఈ సారి అన్ని విభాగాల్లో బ‌లంగా కనిపిస్తుంది. ఆ జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైన‌ప్ బ‌లంగా ఉంది. ఇక ఆ జ‌ట్టులో ముగ్గురు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్లుగా అద‌ర‌గొడుతున్న మార్క‌స్ స్టోయినీస్, జేస‌న్ హోల్డ‌ర్‌, కృనాల్ పాండ్యా ఆ జట్టులో ఉన్నారు. దీంతో వీరి ముగ్గురికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని చెప్పుకోవాలి. మంచి స‌పోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంది. దీంతో ఆ జ‌ట్టు వ్యూహాలు అనుకున్న‌ట్లుగా వ‌ర్కౌట్ అయితే టైటిల్ గెల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఐపీఎల్ 2022లోకి ల‌క్నో టైటిల్ ఫెవ‌రేట్‌గా అడుగుపెట్ట‌నుంది.

ల‌క్నో పూర్తి జ‌ట్టు ఇదే

కేఎల్‌ రాహుల్‌(17 కోట్లు), మార్కస్ స్టొయినిస్‌(9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌(4 కోట్లు), అవేశ్‌ ఖాన్‌(10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య(8.25 కోట్లు), ముజరబాని , క్వింటన్ డికాక్‌( 6.75 కోట్లు), దీపక్‌ హుడా(5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్(90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్‌(50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants

ఉత్తమ కథలు