హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఎవడైనా అటువంటి బంతులను వేస్తాడా? చెన్నై యువ బౌలర్ పై సునీల్ గావస్కర్ ఫైర్

IPL 2022: ఎవడైనా అటువంటి బంతులను వేస్తాడా? చెన్నై యువ బౌలర్ పై సునీల్ గావస్కర్ ఫైర్

సునీల్ గావస్కర్ (ఫైల్ ఫోటో)

సునీల్ గావస్కర్ (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ పరుగుల సునామీని సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ అసలైన టి20 మజాను క్రికెట్ అభిమానులకు పరిచయం చేసింది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ పరుగుల సునామీని సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants) జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ అసలైన టి20 మజాను క్రికెట్ అభిమానులకు పరిచయం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన లక్నో జట్టు 19.3 ఓవర్లలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెన్ ను రీచ్ అయింది. ఈ మ్యాచ్ లో ఎవిన్ లూయిస్, క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీలతో మెరిస్తే... ఆఖర్లో యువ ప్లేయర్ ఆయుశ్ బదోని అదరగొట్టాడు.

మ్యాచ్ పూర్తయ్యాక ఈ మ్యాచ్ ను విశ్లేషించిన క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (sunil gavaskar) చెన్నై ఓడిపోవడానికి కారణాలు చెప్పాడు. మ్యాచ్ లో చెన్నై ఓడిపోవడానికి శివమ్ దూబే బౌలింగే కారణం అంటూ వ్యాఖ్యలు చేశాడు. ’ఎవడైనా అటువంటి బంతులను వేస్తారా?‘ అంటూ దూబే పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 18 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ లో చెన్నై జట్టే పేవరెట్ గా కనిపించింది . ఆఖరి 12 బంతుల్లో విజయం కోసం లక్నో టీం 34 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ జడేజా బంతిని దూబేకి ఇవ్వగా... అతడు ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో లక్నో విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ..

’శివమ్ దూబే ఐపీఎల్ కంటే ముందు వరకు కూడా అనేక టి20 టోర్నీల్లో ఆడాడు. అయినా కూడా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. దూబే బౌలింగ్ ను చూస్తే... ఆ ఓవర్లో అతడు ఎక్కువగా లెంగ్త్ బాల్స్ వేశాడు. లెంగ్త్ బాల్ వేసిన ప్రతీసారి లక్నో బ్యాటర్స్ సిక్సరో ఫోరో కొట్టడం జరిగింది. అప్పుడైనా అతడు తన బౌలింగ్ ను మార్చుకోవాలి కదా... మళ్లీ లెంగ్త్ బాలే. తప్పుల నుంచి దూబే ఏం నేర్చుకోవడం లేదని నాకు అనిపించింది. అలాగే దూబే చేసింది తప్పని 100 శాతం అనలేం. ఎందుకంటే అతడు నేరుగా 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు. అయితే అతడు వేసే బౌలింగ్ శైలి సరైంది కాదు. బ్యాట్ పైకి బంతి చక్కగా వస్తున్న చోటు ఎవరూ కూడా స్లో డెలివరీస్ వేయరు. టర్న్ లేదా డ్రైగా ఉన్న పిచ్ లపై స్లో డెలివరీస్ వేస్తారు.  ఈ తప్పులను దూబే చేయడం వల్లే మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది.‘ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అలాగే 19వ ఓవర్ వేయడానికి శివమ్ దూబేను పిలవడం చెన్నై వ్యూహాత్మక తప్పిదం అని గావస్కర్ అన్నాడు

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Lucknow Super Giants, MS Dhoni, Ravindra Jadeja, Shivam Dube, Sunil Gavaskar

ఉత్తమ కథలు