హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఒక ప్లేయర్... మూడు జట్లు... నాలుగు టైటిల్స్... ఐపీఎల్ లో ఇలాంటి వింత మరోటి ఉండదంటే నమ్మండి

IPL 2022: ఒక ప్లేయర్... మూడు జట్లు... నాలుగు టైటిల్స్... ఐపీఎల్ లో ఇలాంటి వింత మరోటి ఉండదంటే నమ్మండి

కరణ్ శర్మ (PC: TWITTER)

కరణ్ శర్మ (PC: TWITTER)

IPL 2022: ఐపీఎల్ లో వివిధ జట్లకు ఆడుతూ... అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ ఎవరంటే? ఆన్సర్ చెప్పడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు. లేదంటే ఇదేం ప్రశ్న అని మీరు భావించొచ్చు కూడా. కానీ ఇది నిజం..  ఒక ప్లేయర్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జట్లకు ఆడుతూ... ఏకంగా నాలుగు టైటిల్స్ ను సొంతం చేసుకున్నాడు. షాకింగ్ న్యూస్ లా ఉందా? మీరు షాక్ అయినా అవ్వకపోయినా ఇది నిజం.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ఐపీఎల్ టైటిల్ ను ముంబై తర్వాత అత్యధిక సార్లు గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings). ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఐపీఎల్ లో వివిధ జట్లకు ఆడుతూ... అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ ఎవరంటే? ఆన్సర్ చెప్పడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు. లేదంటే ఇదేం ప్రశ్న అని మీరు భావించొచ్చు కూడా. కానీ ఇది నిజం..  ఒక ప్లేయర్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జట్లకు ఆడుతూ... ఏకంగా నాలుగు టైటిల్స్ ను సొంతం చేసుకున్నాడు. షాకింగ్ న్యూస్ లా ఉందా? మీరు షాక్ అయినా అవ్వకపోయినా ఇది నిజం.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కరణ్ శర్మ మూడు జట్లతో నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ను సొంతం చేసుకున్నాడు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున తొలి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడిన అతడు... 2017లో ముంబై ఇండియన్స్  తరఫున రెండో ఐపీఎల్ టైటిల్ ను నెగ్గాడు. అంతటితో ఊరుకున్నాడా అంటే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆ ఏడాది జరిగిన ఫైనల్లో తన మాజీ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గడంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్ ను నెగ్గి సంచలనం నమోదు చేశాడు. మూడేళ్లలో మూడు జట్లతో వరుసగా ఐపీఎల్ టైటిల్స్ నెగ్గి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఈ విధంగా ఐపీఎల్ టైటిల్స్ తో హ్యాట్రిక్ కొట్టిన తొలి ప్లేయర్ గా కొత్త రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ, ధోని లాంటి వాళ్లకే సాధ్యం కాని ఘనతను కరణ్ శర్మ అందుకున్నాడు. ఇక 2019, 2020లో మాత్రం కరణ్ లక్కీ మ్యాజిక్ పనిచేయలేదు. ఆ రెండేళ్లు కూడా మనోడు టైటిల్ నెగ్గలేదు. అయితే 2021లో చెన్నై టైటిల్ నెగ్గడం... ఆ జట్టులో కరణ్ శర్మ ఉండటంతో నాలుగో ఐపీఎల్ టైటిల్ అతడి ఖాతాలో పడింది.

2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ లో కరణ్ శర్మ అడుగు పెట్టాడు. 2009 నుంచి 2012 వరకు కూడా ఆ జట్టుతోనే ఉన్నాడు. అనంతరం 2013 నుంచి 2016 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. ఇక 2017లో ముంబై కి ఆడిన కరణ్ శర్మ... 2018 నుంచి 2021 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. మళ్లీ గత నెలలో జరిగిన మెగా వేలంలో కరణ్ శర్మను రాయల్ చాలెంజర్స్ జట్టే మళ్లీ కొనుగోలు చేసింది. మనోడు ఏ టీంలో ఉంటే ఆ టీం టైటిల్ కొడతాదని భావించో ఏమో తెలీదు కానీ కరణ్ శర్మను బెంగళూరు టీం సొంతం చేసుకుంది. చూద్దాం... కరణ్ శర్మ  అదృష్టం వల్ల బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపీఎల్ చాంపియన్ గా నిలుస్తుందో లేదో?

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Mumbai Indians, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు