Home /News /sports /

IPL 2022 IPL UPDATES ENGLAND CRICKETER ALEX HALES OPTS OUT OF IPL 2022 SEASON KKR NAME AARON FINCH AS HIS REPLACEMENT SJN

IPL 2022: బయో బబుల్ అంటే భయమేస్తోంది... ఐపీఎల్ కి హ్యాండ్ ఇచ్చిన మరో ఇంగ్లండ్ క్రికెటర్

అలెక్స్ హేల్స్ (ఫైల్ ఫోటో)

అలెక్స్ హేల్స్ (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ నుంచి మరో ఇంగ్లండ్ ప్లేయర్ తప్పుకున్నాడు. బయో బబుల్ భయమేస్తోంది అంటూ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడి ప్లేస్ ను ఆస్ట్రేలియా కెప్టెన్ తో ఆ ఫ్రాంచైజీ భర్తీ చేసింది.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే ఇంగ్లండ్ క్రికెటర్లకు చులకనగా ఉన్నట్లు ఉంది. అందుకే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వేలంలోకి రావడం... అమ్ముడవ్వడం... ఆ తర్వాత ఏవో కారణాలు చెప్పి సీజన్ కు దూరం కావడం. చాలా  ఇంగ్లండ్ (England) క్రికెటర్ల నుంచి ఐపీఎల్ జట్లకు తరచూ ఎదురయ్యే ఇబ్బందే ఇది. గతంలో బెన్ స్టోక్స్ (Ben stokes), జోఫ్రా ఆర్చర్ (Jofra Archer), డేవిడ్ మలాన్ (dawid malan) లాంటి ప్లేయర్స్ ఇలా తప్పుకన్న వారే. మొన్నటికి మొన్న బయో బబుల్ లో నేను ఉండలేను బాబాయ్ అంటూ ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (jason roy) గుజరాత్ టైటాన్స్ కు కటీఫ్ చెప్పేశాడు. తాజాగా ఆ జాబితాలోకి మరో ప్లేయర్ ఇంగ్లండ్ ప్లేయర్ చేరాడు.

బయో బబుల్ లో ఉండటం తలకు మించిన భారంగా భావించిన ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ హలెక్స్ హేల్స్.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. హేల్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే హేల్స్ మాత్రం ఇప్పుడు బయో బబుల్ సాకు చూపి సీజన్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. అదే సమయంలో హేల్స్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నాడు.








View this post on Instagram






A post shared by Alex Hales (@alexhales1)






అరోన్ ఫించ్ (Aaron Finch)తో భర్తీ

అలెక్స్ హేల్స్ ఐపీఎల్ కు దూరమవ్వడంతో అతడి స్థానాన్ని ఆస్ట్రేలియా () పరిమిత ఓవర్ల సారథి అరోన్ ఫించ్ తో కేకేఆర్ జట్టు భర్తీ చేసింది. అతడితో రూ. 1.5 కోట్లతో కేకేఆర్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి ఫించ్ వచ్చినా అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. దాంతో అతడు అన్ సోల్డ్ ప్లేయర్స్ జాబితాలో నిలిచాడు. తాజాగా హలెక్స్ హేల్స్ తప్పుకోవడం ఫించ్ పాలిట వరంలా మారింది. ఐపీఎల్ లో ఫించ్ కు ఇది 9వ ఫ్రాంచైజీ కావడం విశేషం. 2010లో తొలిసారి రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు ఎంపికైన ఫించ్... అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణే వారియర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఎక్కువ శాతం మాత్రం బెంచ్ కే పరిమితమయ్యాడు. ఫించ్ తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటి వరకు 85 మ్యాచ్ లు ఆడి 2005 పరుగులు సాధించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, IPL, IPL 2022, Kolkata Knight Riders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు