IPL 2022 IPL UPDATES DY PATIL STADIUM IPL STATS PITCH REPORT AND WEATHER FORECAST DETAILS SJN
IPL 2022: బ్యాటర్లూ... ఈ పిచ్ పై కాస్త జాగ్రత్త... అలసత్వం ప్రదర్శిస్తే ఇక అంతే సంగతులు
డీవై పాటిల్ స్టేడియం (ఫైల్ ఫోటో)
IPL 2022: ముంబై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో డీవై పాటిల్ స్టేడియం ఉంది. దీన్ని 2007లో ఆరంభించారు. ఈ గ్రౌండ్ లో 12 ప్రాక్టీస్ పిచ్ లు ఉన్నాయి. క్రికెట్ తో పాటు డీవై పాటిల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు కూడా ఆతిథ్యమిచ్చింది. 2017లో జరిగిన అండర్ 17 ఫుట్ బాల్ ప్రపంచకప్ కు డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిలువడం విశేషం.
IPL 2022: కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ మొత్తం కూడా మహారాష్ట్ర (Maharashtra) వేదికగా జరగనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బీసీసీఐ (BCCI) మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాలను ఎంపిక చేసింది. ఈ నాలుగు స్టేడియాల్లో మూడు మైదానాలు ముంబై (Mumbai)లో ఉండగా... మరోటి పుణేలో ఉంది. ముంబైలోని స్టేడియాల్లో విఖ్యాత వాంఖడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలు ఉన్నాయి. మరో స్టేడియం పుణేలోని ఎంసీఏ స్టేడియం. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలు చెరో 20 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. బ్రబోర్న్, ఎంసీఏ స్టేడియాలు కలిసి 30 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డీవై పాటిల్ స్టేడియం వివరాలు గురించి తెలుసుకుందాం.
ముంబై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో డీవై పాటిల్ స్టేడియం ఉంది. దీన్ని 2007లో ఆరంభించారు. ఈ గ్రౌండ్ లో 12 ప్రాక్టీస్ పిచ్ లు ఉన్నాయి. క్రికెట్ తో పాటు డీవై పాటిల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు కూడా ఆతిథ్యమిచ్చింది. 2017లో జరిగిన అండర్ 17 ఫుట్ బాల్ ప్రపంచకప్ కు డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిలువడం విశేషం.
డీవై పాటిల్ స్టేడియం స్టాట్స్
అత్యధిక స్కోరు : 7 వికెట్లకు 190 పరుగులు. పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ స్కోరును సాధించింది.
అత్యల్ప స్కోరు : 82. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో డెక్కన్ చార్జర్స్ ఈ స్కోరును నమోదు చేసింది.
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : 4/13. ఆస్ట్రేలియన్ పేసర్ డగ్ బొలింజర్ నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన అతడు... డెక్కన్ చార్జర్స్ పై ఈ ప్రదర్శనను నమోదు చేశాడు.
అత్యధిక భాగస్వామ్యం: 155. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో డెక్కన్ చార్జర్స్ ప్లేయర్స్ ఆడమ్ గిల్ క్రిస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ కలిసి నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో గిల్ క్రిస్ట్ 47 బంతుల్లో 109 పరుగులు చేశాడు. లక్ష్మణ్ 26 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులు: ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రాబిన్ ఉతప్ప నిలిచాడు. అతడు ఈ మైదానంలో 226 పరుగులు చేశాడు. 2008 సీజన్ లో ఉతప్ప ఈ రికార్డును అందుకున్నాడు.
అత్యధిక వికెట్లు: ఈ మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డగ్ బొలింజర్ ఉన్నాడు. ఈ స్టేడియంలో బొలింజర్ 8 వికెట్లు తీశాడు.
సీటింగ్ కెపాసిటీ: స్టేడియం కెపాసిటీ 55 వేలు.
పిచ్ స్వభావం: డీవై పాటిల్ పిచ్ బ్యాటింగ్ వికెట్. పిచ్ పై బౌన్స్ ఉండటంతో మ్యాచ్ ఆరంభంలో బౌలర్లు చెలరేగే అవకాశం ఉంది. అయితే బంతి పాత పడ్డాక బాల్ నేరుగా బ్యాట్ పైకి వస్తుంది. 160-170 పరుగులు చేసే అవకాశం ఉంటుంది.
వాతావరణం: ఏప్రిల్, మే నెలల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. అయితే మే నెలలో వర్షం కురిసే అవకాశం ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.