IPL 2022: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే రౌద్రం, రణం, రుధిరం. ఎంటీ అర్థం కాలేదా? అదేనండీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) పేరు మాాత్రమే వినిపిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జరుగుతుందంటే ఎవరైనా సరే సినిమాలు విడుదల చేయడానికి భయపడతారు... కానీ రాజమౌళి మాత్రం ఐపీఎల్ ఆరంభమైన మరుసటి రోజే తన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక ఐపీఎల్ జట్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో తమ ఫ్యాన్స్ కు దగ్గర కావాలని చూస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అయితే పుష్ప సినిమా డైలాగ్ ను తమ ప్లేయర్స్ తో చెప్పించే ప్రయత్నం చేసింది కూడా.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టు కూడా ఆర్ఆర్ఆర్ మాయలో పడింది. ఆ సినిమాకు కొత్త అర్థం చెప్పింది. ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి రౌద్రం, రణం, రుధిరం అనే పేరును ఇస్తే... చెన్నై సూపర్ కింగ్స్ మరో అర్థాన్ని ఇచ్చింది. అదేంటంటే ఒక ఆర్ కు రుతురాజ్ అని... మరో ఆర్ కు రాబిన్ అని... ఇంకో ఆర్ కు రాయుడు అని అర్థం ఇచ్చింది. ఇలా పేర్లు మాత్రమే చెప్పి ఆగలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లాగే ఒక లోగోను క్రియేట్ చేసి... అందులో అచ్చం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ లను ఎలా ఉంచారో... అలానే చెన్నై కూడా ఆర్ఆర్ఆర్ లోగోపై రుతురాజ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు ఫేస్ లను ఉంచింది. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.
The ? TRRRIO!#WhistlePodu #Yellove ?? pic.twitter.com/P7zL6qWtow
— Chennai Super Kings (@ChennaiIPL) April 7, 2022
చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ ను పేలవంగా ఆరంభించింది. ఆడిన తొలి మూడు మ్యాచ్ ల్లోనూ ఓడి ఫ్యాన్స్ ను నిరుత్సాహంలో పడేసింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ముఖ్యంగా గతేడాది జరిగిన ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్ గైక్వాడ్... ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. రేపు జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని చెన్నై జట్టు పట్టుదలగా ఉంది. ఇకపై చెన్నై ఓడే ప్రతి మ్యాచ్ కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.