Home /News /sports /

IPL 2022 IPL UPDATES BRABOURNE STADIUM IPL STATS PITCH REPORT AND WEATHER FORECAST DETAILS SJN

IPL 2022: ఐపీఎల్ వేదికల్లో ఒకటైన బ్రబోర్న్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

బ్రబోర్న్ స్టేడియం (ఫైల్ ఫోటో)

బ్రబోర్న్ స్టేడియం (ఫైల్ ఫోటో)

IPL 2022: బ్రబోర్న్ స్టేడియాన్ని 1937లో ఆరంభించారు. ముంబై లోని విఖ్యాత వాంఖడే స్టేడియానికి కొన్ని అడుగుల దూరంలోనే బ్రబోర్న్ స్టేడియం ఉండటం విశేషం. అయితే వాంఖడే అందుబాటులోకి రావడంతో బ్రబోర్న్ మైదానంలో మ్యాచ్ లు పెద్దగా జరగడం లేదు.

ఇంకా చదవండి ...
IPL 2022:  కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ మొత్తం కూడా మహారాష్ట్ర (Maharashtra) వేదికగా జరగనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బీసీసీఐ (BCCI) మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాలను ఎంపిక చేసింది. ఈ నాలుగు స్టేడియాల్లో మూడు మైదానాలు ముంబై (Mumbai)లో ఉండగా... మరోటి పుణేలో ఉంది. ముంబైలోని స్టేడియాల్లో విఖ్యాత వాంఖడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలు ఉన్నాయి. మరో స్టేడియం పుణేలోని ఎంసీఏ స్టేడియం. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాలు చెరో 20 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. బ్రబోర్న్, ఎంసీఏ స్టేడియాలు కలిసి 30 మ్యాచ్ లకు వేదిక కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంతో చరిత్ర కలిగిన బ్రబోర్న్ స్టేడియం గురించి తెలుసుకుందాం.క

బ్రబోర్న్ స్టేడియాన్ని 1937లో ఆరంభించారు. ముంబై లోని విఖ్యాత వాంఖడే స్టేడియానికి కొన్ని అడుగుల దూరంలోనే బ్రబోర్న్ స్టేడియం ఉండటం విశేషం. అయితే వాంఖడే అందుబాటులోకి రావడంతో బ్రబోర్న్ మైదానంలో మ్యాచ్ లు పెద్దగా జరగడం లేదు. అయితే తాజాగా కరోనా కారణంతో మ్యాచ్ లన్నీ కూడా మహారాష్ట్ర వేదికగా జరగనుండటంతో బ్రబోర్న్ స్టేడియాన్ని కూడా బీసీసీఐ ఎంపి చేసింది. బ్రబోర్న్ వేదికగా మొత్తం 15 మ్యాచ్ లు జరగనున్నాయి.
బ్రబోర్న్ స్టేడియం స్టాట్స్
ఒకే ఒక అంతర్జాతీయ టి20  : ఇప్పటి వరకు కూడా బ్రబోర్న్ మైదానంలో కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడిని ఈ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 166 పరుగులు చేయగా... భారత్ ఆ స్కోరును కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో ఛేదించింది. పాంటింగ్ 76 పరుగులు చేయగా... భారత్ తరఫున గౌతం గంభీర్ 63 పరుగులు చేశాడు.

ఐపీఎల్ రికార్డ్స్

ఇప్పటి వరకు బ్రబోర్న్ వేదికగా మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 6 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిస్తే... 5 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి.
అత్యధిక స్కోరు : 6 వికెట్లకు 212 పరుగులు. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఈ స్కోరును నమోదు చేసింది.అత్యల్ప స్కోరు : 115. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో డెక్కన్ చార్జర్స్ జట్టు ఈ స్కోరును నమోదు చేసింది.
అత్యధిక వ్యక్తిగత స్కోరు : షేన్ వాట్సన్ (104). అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన : క్రిస్ మోరిస్ 4/23.
అత్యధిక ఛేజింగ్ స్కోరు : 181/5. చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఈ స్కోరు చేసి గెలిచింది.

సీటింగ్ కెపాసిటీ:  20వేలు.
పిచ్ స్వభావం: బ్రబోర్న్ స్టేడియం అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే డ్యూ ఫాక్టర్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ లు రాత్రి పూట జరగనున్న సమయంలో మ్యాచ్ జరిగే కొద్ది బౌలర్లకు డ్యూ సమస్యగా మారుతుంది. అందుకే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. బౌండరీ చాలా దగ్గరగా ఉండటంతో పవర్ హిట్టర్లకు పండగే అని చెప్పాలి.

వాతావరణం: ఏప్రిల్, మే నెలల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.  మే నెలలో వర్షం కురిసే అవకాశం ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, IPL, IPL 2022, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు