Home /News /sports /

IPL 2022 IPL UPDATES BCCI PROPOSED SIX TEAM WOMENS IPL FROM 2023 AT IPL GOVERNING COUNCIL ON FRIDAY SJN

IPL 2022: మరో ధనాధన్ లీగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన బీసీసీఐ... వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో...

చాలెంజర్ టోర్నీ (ఫైల్ ఫోటో)

చాలెంజర్ టోర్నీ (ఫైల్ ఫోటో)

IPL 2022: క్రికెట్ (Cricket) అభిమానులకు గుడ్ న్యూస్... వచ్చే ఏడాది నుంచి మరో ధనాధన్ లీగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది నుంచి  మహిళల విభాగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ను నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
IPL 2022: క్రికెట్ (Cricket) అభిమానులకు గుడ్ న్యూస్... వచ్చే ఏడాది నుంచి మరో ధనాధన్ లీగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది నుంచి  మహిళల విభాగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ను నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమైంది. ఆరు జట్లతో ఈ లీగ్ ను నిర్వహించేందకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ శుక్రవారం తన ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ముంబై లో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. మహిళల క్రికెట్ కు ఈ లీగ్ ఎంతగానో తోడ్పడుతుందని బీసీసీఐ పేర్కొంది. ఈ ఏడాది మాత్రం అమ్మాయిల విభాగంలో గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్లే మూడు జట్లతో టి20 చాలెంజ్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు.

2018లో మహిళల విభాగంలో ఐపీఎల్ మాదిరి  ఉమెన్స్ టి20 చాలెంజ్ టోర్నమెంట్ ను బీసీసీఐ తీసుకొచ్చింది. కేవలం మూడు జట్లతో వారం పాటు ఈ టోర్నీని నిర్వహించింది. సూపర్ నోవా, ట్రయిల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు ఈ చాలెంజ్ టోర్నీలో పాల్గొన్నాయి. వీటికి భారత స్టార్ ప్లేయర్లు మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు కెప్టెన్లుగా వ్యవహరించారు. 2018 నుంచి 2020 వరకు మూడు పర్యాయాలు ఈ టోర్నీ జరిగిందికరోనా వల్ల 2021లో జరగాల్సిన ఈ టోర్నీని నిర్వహించలేదు. 2018, 19 సీజన్లలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవా జట్టు చాంపియన్ గా నిలిచింది. 2020లో స్మృతి మంధాన నాయత్వంలోని జట్టు ట్రయల్ బ్లేజర్స్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది నుంచి కరీబియన్ వేదికగా సీపీఎల్ లాగానే మహిళల విభాగంలో కూడా టి20 లీగ్ ను నిర్వహించేందుకు క్రికెట్ వెస్టిండీస్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలోపాకిస్తాన్ లో కూడా మహిళల విభాగంలో ఒక టి20 టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమాయత్తమవుతోంది.

అందుతోన్న సమాచారం ప్రకారం... ముందుగా బీసీసీఐ ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఎవరికైనా మహిళల జట్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ లేకపోతే అప్పుడు కొత్త వారిని ఈ జట్ల కోసం బిడ్ వేయాల్సిందిగా కోరుతుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Cricket, IPL, IPL 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు