హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఐపీఎల్ కు ఆర్ఆర్ఆర్ సెగ..! షాక్ లో బీసీసీఐ... ఇలానే కొనసాగితే భారీ నష్టం తప్పదు..

IPL 2022: ఐపీఎల్ కు ఆర్ఆర్ఆర్ సెగ..! షాక్ లో బీసీసీఐ... ఇలానే కొనసాగితే భారీ నష్టం తప్పదు..

టాటా ఐపీఎల్

టాటా ఐపీఎల్

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ బీసీసీఐ (BCCI) అనుకున్న రీతిలో సాగడం లేదు. కొత్తగా రెండు జట్లు లీగ్ లోకి ఎంటర్ అవ్వడం... అలాగే కోవిడ్ తర్వాత భారత్ (India) లో పూర్తి స్థాయిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుండటంతో లీగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు కనిపించింది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ బీసీసీఐ (BCCI) అనుకున్న రీతిలో సాగడం లేదు. కొత్తగా రెండు జట్లు లీగ్ లోకి ఎంటర్ అవ్వడం... అలాగే కోవిడ్ తర్వాత భారత్ (India) లో పూర్తి స్థాయిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుండటంతో లీగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు కనిపించింది. అంతే కాకుండా ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలానికి ఎన్నడూ లేనంత ప్రచారం జరగడంతో ఈసారి ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతుందని అందురూ భావించారు. ముఖ్యంగా బీసీసీఐ. అయితే ఐపీఎల్ ఆరంభం అయ్యాక... ఇదంతా అబద్ధం అని తేలింది. అసలు ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా మ్యాచ్ లన్నీ మహారాష్ట్రలో జరుగుతుండటం... అదే సమయంలో మ్యాచ్ లు కూడా చప్పగా జరగుతుండటం వంటి అంశాలు ప్రజలను టీవీ సెట్ల ముందు కట్టిపడేలా చేయడం లేదు.

10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 సీజన్ తొలి వారం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. గతేడాదితో పోలిస్తే టీఆర్‌పీ రేటింగ్స్ ఏకంగా 33 శాతం తగ్గిపోగా.. వ్యూయర్ షిప్ 14 శాతం పడిపోయింది. కరోనా వైరస్ వంటి కఠిన పరిస్థితుల్లో జరిగిన ఐపీఎల్ 2020, 2021 సీజన్లు టీఆర్‌పీ రేటింగ్స్, వ్యూయర్ షిప్ పరంగా అదరగొట్టింది. అయతే ఈ సీజన్ ఆరంభం మాత్రం చెప్పుకోదగ్గ స్థితిలో లేదనే చెప్పాలి. అంతేకాకుండా తాజా సీజన్ దాదాపు 65 రోజుల పాటు 74 మ్యాచ్ లతో సుదీర్ఘంగా జరగనుండటం కూడా ఐపీఎల్ వ్యూయర్ షిప్ తగ్గిపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఆడిన తొలి మూడు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమయ్యాయి. మూడు మ్యాచ్ ల్లోనూ ఓడి హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు ఫ్యాన్ బేస్ మిగిలిన జట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ జట్లలో ఒక్క ఆర్సీబీ మాత్రమే ఫర్వాలేదనిపిస్తోండగా... మిగిలిన రెండు జట్లు పేలవ ఆటతీరును కనబరిచాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కారణమా

దేశంల ో ఎక్కడ చూసినా ఇప్పుడు ఐపీఎల్ కంటే కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రధాణ పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఐపీఎల్ కు సరిగ్గా ఒక రోజు ముందర రిలీజ్ అయ్యి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు. సాయంత్రం సమయాల్లో సినిమాను కుటుంబంతో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడం... అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు సాయంత్ర ఆరంభం అవ్వనుండటంతో ఐపీఎల్ టీఆర్‌పీ రేటింగ్స్ భారీగా పడిపోవడానికి కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

ఇక స్కోరు వివరాలను ఎప్పటికప్పుడు అందజేసే యాప్ లు కూడా రాడంతో యువ క్రికెట్ ప్రేక్షకులు మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడటం కంటే కూడా అప్ డేట్స్ తెలుసుకోవడానికే ఇష్ట పడుతున్నట్లు సమాచారం. ఇదే గనుక రాబోయే రోజుల్లో కొనసాగితే అది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూపై పడే అవకాశం ఉంది. టీఆర్‌పీ రేటింగ్స్, వ్యూయర్ షిప్ పెంచేందుకు బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

First published:

Tags: Bcci, Chennai Super Kings, IPL, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, RRR, Sunrisers Hyderabad, TRP shows