Home /News /sports /

IPL 2022 IPL RESULTS IN 1996 50 OVER IPL WAS PROPOSED BY LALIT MODI BUT THEN BCCI BOSS JAGMOHAN DALMIYA SHOT IT DOWN SJN

IPL 2022: ఏంటీ నిజమా..? ఐపీఎల్ 1996లోనే ఆరంభం కావాలా? అయితే అప్పుడు...

ఐపీఎల్ (ఫైల్ ఫోటో)

ఐపీఎల్ (ఫైల్ ఫోటో)

IPL 2022: క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ సంచలనం. అప్పటి వరకు క్రికెట్ అంటే కేవలం దేశం కోసం ఆడటం మాత్రమే ఉండగా... ఐపీఎల్ రాకతో క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది.

IPL 2022: క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ సంచలనం. అప్పటి వరకు క్రికెట్ అంటే కేవలం దేశం కోసం ఆడటం మాత్రమే ఉండగా... ఐపీఎల్ రాకతో క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. యూరప్ దేశాల్లో జరిగే ఫుట్ బాల్ లీగ్ ల మాదిరి క్రికెట్ లో కూడా ఒక లీగ్ ను ఎందుకు ఏర్పాటు చేయకూడదనే తలంపుతో లలిత్ మోదీ ఐపీఎల్ కు శ్రీకారం చుట్టాడు. అదే సమయంలో బీసీసీఐ (BCCI) పోటీగా ఇండియాలో ఇండియన్ క్రికెట్ లీగ్ పేరిట ఓ లీగ్ పుట్టుకొచ్చింది కూడా. ఇండియన్ క్రికెట్ లీగ్ ను కపిల్ దేవ్, ఎస్సెల్ గ్రూప్ చైర్మెన్ శుభాశ్ చంద్ర కలిసి రూపొందించారు. ఇందులో అబ్దుల్ రజాక్, అంబటి రాయుడు (Ambati Rayudu) వంటి వారు కూడా ఆడారు. అయితే ఎప్పుడైతే లలిత్ మోడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తెరపైకి తీసుకొచ్చాడో... ఇండియన్ క్రికెట్ లీగ్ అడ్రస్ లేకుండా పోయింది. అయితే ఐపీఎల్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను రత్నాకర్ శెట్టి తన పుస్తకం ’ ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ‘లో పేర్కొన్నాడు.

1996 ప్రపంచకప్ ముగిశాక... 50 ఓవర్ల ఫార్మాట్ లో లోకల్, అంతర్జాతీయ ప్లేయర్లతో ఓ క్రికెట్ లీగ్ ను జరుపాలని లలిత్ మోడి బీసీసీఐకి సూచించాడని రత్నాకర్ తన బుక్ లో పేర్కొన్నాడు. అంటే ఇప్పుడు జరిగే ఐపీఎల్ మాదిరి. అయితే అప్పటి బీసీసీఐ బాస్ జగ్మోహన్ దాల్మియా ఈ లీగ్ నిర్ణయాన్ని తోసి పుచ్చాడని రత్నాకర్ పేర్కొన్నాడు. ఆ సమయంలో బీసీసీఐలో లలిత్ మోడీకి పెద్దగా పలుకుబడి లేదు. దాంతో బీసీసీఐలో తన మాట చెల్లుబాటు కావాలంటే... రాష్ట్ర క్రికెట్ సంఘాల మద్ధతు అవసరం అని లలిత్ మోడి భావించాడు. ఆ దిశగా అతడు అడుగులు వేశాడు.

2005లో సెంట్రల్ జోన్ నుంచి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైయ్యాడు. అక్కడి నుంచి తన కలల లీగ్ ఐపీఎల్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అయితే 2006 నుంచి క్రికెట్ లో టి20 ఫార్మాట్ ఆరంభం కావడం. 2007 టి20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలువడంతో లలిత్ మోడి... 50 ఓవర్ల లీగ్ ను 20 ఓవర్ల కు కుదించాడు. అంతే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ను వేగంగా పూర్తి చేశాడు. 8 జట్లతో 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఏ స్టోర్ట్స్ లోనూ లేని వేలం పద్ధతిని ఐపీఎల్ తో ప్రపంచానికి పరిచయం చేశాడు.

2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్ తోనే లలిత్ మోడీ సూపర్ సక్సెస్ అయ్యాడు. కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. బ్రెండన్ మెకల్లం సెంచరీతో చెలరేగడంతో లలిత్ మోడీ వెనుదిరిగి చూసుకోలేదు. ఐపీఎల్ ఇప్పుడు క్రికెట్ తో పాటు డబ్బుతో ముడిపడిన ఆట. 1996లో భీజం పడ్డ ఐపీఎల్ 2008లో కార్యచరణలోకి రావడం జరిగిందన్నమాట.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ambati rayudu, Bcci, Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, Sunrisers Hyderabad

తదుపరి వార్తలు