IPL 2022: హనుమ విహారి (Hanuma Vihari), మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ల తర్వాత టీమిండియా (Team India)కు రెగ్యులర్ ప్లేయర్ గా ఆడే సత్తా ఉన్న ప్లేయర్ గా తిలక్ వర్మ (Tilak Verma) కనిపిస్తున్నాడు. ఇప్పటికే దేశవాళీ సీజన్ లో సూపర్ బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కళ్లలో పడ్డ అతడు... ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో ఆ జట్టుకే సొంతం అయ్యాడు. సొంతం అవ్వడమే కాదు... 2022 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై జట్టు తరఫున అరంగేట్రం కూడా చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లో 15 బంతుల్లో 22 పరుగులు సాధించిన తిలక్ వర్మ... చూడచక్కటి షాట్లతో అలరించాడు. అంతేకాదు తనలో స్ట్రోక్ ప్లేయర్ ఉన్నాడని ముంబై మేనేజ్ మెంట్ కు తెలిసేలా చేశాడు.
ఈ క్రమంలో తిలక్ వర్మ... ముంబై టీవీ ద్వారా తన గురించి క్రికెట్ ప్రేక్షకులకు తెలియని కొన్ని విషయాలను తెలియజేశాడు. తాను లెఫ్టాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ గా చెప్పుకొచ్చిన తిలక్ వర్మ... జట్టుకు అవసరం అయితే ఆఫ్ స్పిన్నర్ గా మారి బంతులను కూడా వేయగలనని చెప్పాడు. ఇక సురేశ్ రైనా ()ను తన ఫేవరెట్ ప్లేయర్ గా పేర్కొన్నాడు. కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ లను ఆడటం తనకు ఇష్టం అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.
Tilak ke batting ki jhalak toh humne dekh li...?? Now it's time to get to know him a bit better! ?#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/sOkywpWiCd
— Mumbai Indians (@mipaltan) March 30, 2022
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ తో తిలక్ వర్మ వేలంలోకి రాగా... అతడిని దక్కించుకునేందుకు నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్యలో తప్పుకున్నా... ఆ తర్వాత ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇతడి కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై జట్టు రూ. 1.7 కోట్లకు తిలక్ వర్మను సొంతం చేసుకుంది. అనంతరం దేశవాళీ క్రికెట్ లో తిలక్ వర్మ ఆటను క్లోజ్ గా అబ్జర్వ్ చేశామని ముంబై బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. అందుకే అతడిని వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. తిలక్ వర్మ తన డెబ్యూ మ్యాచ్ తోనే తనలో ఓ మంచి బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే మాత్రం... మరో సూపర్ బ్యాటర్ ఇండియాకు దొరికినట్లే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Hanuma vihari, IPL, IPL 2022, Mohammed Siraj, Mumbai Indians, Rohit sharma, Team India