హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఇప్పుడు తల బద్దలు కొట్టుకుంటే ఏం లాభం కావ్య పాప... అదేదో వేలం అప్పుడే ఉండాల్సింది!

IPL 2022: ఇప్పుడు తల బద్దలు కొట్టుకుంటే ఏం లాభం కావ్య పాప... అదేదో వేలం అప్పుడే ఉండాల్సింది!

కావ్య మారన్ (PC: TWITTER)

కావ్య మారన్ (PC: TWITTER)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సహ యజమాని కావ్య మారన్ (Kaviya Maran) ప్రదర్శంచిన హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సహ యజమాని కావ్య మారన్ (Kaviya Maran) ప్రదర్శంచిన హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోమవారం లక్నోతో హైదరాబాద్ జట్టు తలపడగా... అందులో కావ్య మారన్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బౌలింగ్ లో రాణించిన సన్ రైజర్స్ లక్నో జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అనంతరం ఛేజింగ్ ఆరంభంచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత వికెట్లను వెంట వెంటనే కోల్పోయినా... నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్ ఆదుకోవడంతో మ్యాచ్ లో నిలదొక్కుకుంది.

వీరిద్దరు బ్యాటింగ్ చేసే తీరును చూస్తే మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిచేలా కనిపించింది. అయితే వీరిద్దరు అవుటయ్యాక జట్టు ఆటతీరు గాడి తప్పింది. వరుస విరామాల్లో వికెట్లు పడుతుంటే... స్టేడియంలో వీఐపీ గ్యాలరీ నుంచి చూస్తోన్న టీం ఓవర్ కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. అంతకుమందు ముసి ముసి నవ్వులతో వెలిగిపోయిన ఆమె మొహం... అంతలోనే వాడిపోయిన గులాబీలా అయిపోయింది. తల బాదుకుంటూ తెగ బాధ పడిపోయింది. తాజాగా ఈమె బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కొందరు స్పందిస్తూ ఇప్పుడు బాధ పడితే ఏం ప్రయోజం... ఇదేదో వేలం అప్పుడే ఉండాల్సింది.

మరొకరు అయితే... ఈ సీజన్ మొత్తం కూడా కావ్య ఇదే ఎక్స్ ప్రెషన్ తో ఉంటుందని కామెంట్ చేశాడు. అవును మరీ సన్ రైజర్స్ జట్టును చూస్తే... ఎవరికైనా సరే బలహీనమైన జట్టే అనిపిస్తుంది. ఓపెనింగ్ జోడీ సరిగ్గా లేదు. మిడిలార్డర్ నమ్మకంగా కనబడటం లేదు. ఇక ఫినిషర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు వేలంలో ఏ స్ట్రాటజీతో ఆటగాళ్లను కొనుగోలు చేసిందే కావ్య మారన్ కు తప్ప ఆ సమయంలో పక్కనే ఉన్న కోచ్ టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ లకు కూడా తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే వేలంలో అన్నీ తనకే తెలుసు అన్నట్లు ఆటగాళ్లను కొనుగోలు చేసింది కావ్య మారన్. అబ్దుల్ సమద్ జట్టుతో నాలుగేళ్లకు పైగానే ఉంటున్న ఒక్కసారి కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. అతడిని ఎందుకు రీటెయిన్ చేసుకుందో ఆమెకే తెలియాలి. ఇక వేలంలో అభిషేక్ శర్మను ఏం చూసి 6.5 కోట్లు చెల్లించిందో కూడా కావ్యకే తెలియాలి. అందులో పావల భాగం ఖర్చు చేసినా తిలక్ వర్మ లాంటి హైదరాబాద్ ప్లేయర్ దొరికేవాడు కదా. వేలంలో హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన ప్లేయర్స్ లో ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రమే అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, KL Rahul, Lucknow Super Giants, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు