హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: చావో రేవో స్థితిలో రోహిత్ శర్మ.. ఈరోజు కూడా తేడా కొడితే.. ముంబై ఇక అస్సామే..

IPL 2022: చావో రేవో స్థితిలో రోహిత్ శర్మ.. ఈరోజు కూడా తేడా కొడితే.. ముంబై ఇక అస్సామే..

రోహిత్ శర్మ (ఫైల్ ఫోటో)

రోహిత్ శర్మ (ఫైల్ ఫోటో)

IPL 2022- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ప్రత్యేకమై ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్ టైటిల్ ను ఏ జట్టుకు కూడా సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు గెల్చుకుంది.

IPL 2022- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ప్రత్యేకమై ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్ టైటిల్ ను ఏ జట్టుకు కూడా సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు గెల్చుకుంది. ఇక రోహిత్ శర్మ (Rohit sharma) లాంటి సూపర్ కెప్టెన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాంటి ప్లేయర్ సలహాలతో పాటు మహేలా జయవర్ధనే, రాబిన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి స్టార్ కోచింగ్... ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ముంబై రాతను మార్చలేకుండా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals)తో మొదలైన ఓటముల పరంపర.. పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో జరిగిన లాస్ట్ మ్యాచ్ వరకు కొనసాగింది. ముంబై ఇండియన్స్ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్ ల్లోనూ ఓడి ' సున్నా పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంల ో కొనసాగుతోంది.

నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పటిష్ట లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో తలపడనుంది. లక్నో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి రెండింటిలో ఓడింద. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఈ సీజన్ లో పది జట్లు ఆడుతుండటంతో.. ప్లే ఆఫ్స్ కు టఫ్ ఫైట్ జరుగుతుంది. గత మ్యాచ్ లో విజయం  సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ వైపు ఆశగా చూస్తుంది. అయితే ముంబై మాత్రం స్టార్ ప్లేయర్స్ ఉన్నా... వరుస పరాజయాలతో డీలా పడింది.

నేడు జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినట్లయితే.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే.. అందుకే లక్నోతో మ్యాచ్ రోహిత్ సేనకు చావో రేవో లాంటిది. ఇక్కడ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుందో లేక ఓడి లీగ్ దశతోనే ముగిస్తుందో నేటితో దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : దేశం కోసం నిరాహార దీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్..

బౌలింగే ప్రధాన సమస్య

ముంబై ఇండియన్స్ ను బౌలింగ్ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా బౌల్ట్ స్థనాన్ని భర్తీ చేసే ప్లేయరే కరువయ్యాడు. బుమ్రా మెరుస్తున్నా.. అతడికి సహకారం అందించే మరో బౌలర్ కరువయ్యాడు. అదే సమయంలో జట్టును స్పిన్నర్ సమస్య కూడా వేధిస్తోంది. ఇక బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ లు మాత్రమే నిలకడ చూపుతున్నారు. గత మ్యాచ్ తో బేబీ ఏబీ డివాల్డ్  బ్రేవిస్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఓపెనర్లుగా వస్తోన్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదు. తొలి రెండు మ్యాచ్ ల్లో ఫర్వాలేదనిపించిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత గాడి తప్పాడు. మైదానంలో అతడిని చూస్తుంటే పూర్తి ఫిట్ నెస్ తో లేడని కనిపిస్తోంది. ఇక రోహిత్ ఆరంభాలు బాగుంటున్నా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. ఇక పొలార్డ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేటి మ్యాచ్ లో ముంబై విజయం సాధిస్తే.. ఒకే కానీ.. లేకుంటే జట్టు మొత్తం అస్పాం టికెట్ బుక్ చేసుకున్నట్లే లెక్క.

First published:

Tags: Kieron pollard, KL Rahul, Lucknow Super Giants, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar

ఉత్తమ కథలు