Home /News /sports /

IPL 2022 IPL MEDIA RIGHTS AUCTION TECH GIANTS APPLE NETFLIX AND FACEBOOK LIKELY TO COMPETE WITH AMAZON DISNEY AND ZEE SONY FOR IPL MEDIA RIGHTS FOR 2023 TO 2027 CYCLE SJN

IPL 2022-BCCI: టార్గెట్ రూ. 50 వేల కోట్లు.. రేసులో యాపిల్, ఫేస్ బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్... కాసుల కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్

టాటా ఐపీఎల్

టాటా ఐపీఎల్

IPL 2022-BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అటు ఆటగాళ్ల రాతను... ఇటు బీసీసీఐ (BCCI) రాతను మార్చేసిన క్రికెట్ లీగ్. ఏ ముహూర్తాన లలిత్ మోది (Lailit Modi) ఐపీఎల్ కు రూపకల్పన చేశాడో. నాటి నుంచి నేటి వరకు బీసీసీఐ పై కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది.

ఇంకా చదవండి ...
IPL 2022-BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అటు ఆటగాళ్ల రాతను... ఇటు బీసీసీఐ (BCCI) రాతను మార్చేసిన క్రికెట్ లీగ్. ఏ ముహూర్తాన లలిత్ మోది (Lailit Modi) ఐపీఎల్ కు రూపకల్పన చేశాడో. నాటి నుంచి నేటి వరకు బీసీసీఐ పై కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. దేశంలో ఎన్నికలు జరిగినా... కరోనా వంటి మహమ్మారులు వచ్చి అతలాకుతలం చేసినా ఐపీఎల్ మాత్రం బీసీసీఐపై కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. 2008లో ఆరంభమైన ఐపీఎల్...  ఇయర్ ఇయర్ కు తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుంటూ పోతుంది. తాజాగా మరోసారి ఐపీఎల్ బీసీసీఐపై కాసుల వర్షం కురిపించే సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది అంటే 2023 నుంచి 2027 వరకు అంటే ఐదేళ్ల కాలానికి సంబంధించిన మీడియా రైట్స్ ను విక్రయించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా దాదాపు రూ. 50 వేల కోట్లను ఆర్జించాలనే మాస్టర్ ప్లాన్ తో సిద్ధమైంది.

ఈ ఏడాది వరకు కూడా ఐపీఎల్ మీడియా రైట్స్ స్టార్ స్పోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఐదేళ్ల క్రితం 2018లో ఐపీఎల్ మీడియా హక్కులను స్టార్ మీడియా  రూ. 16,347 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇప్పడు వీటి రేటును డబుల్ చేసింది. అంతేకాకుండా మీడియా రైట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించింది. దాంతో మరింత ధనాన్ని ఆర్జించేందుకు బీసీసీఐ పక్కా ప్రణాళికతో అడుగుటు వేస్తుంది. మీడియా హక్కుల బేస్ ప్రైజ్ ను రూ. 33 కోట్లుగా నిర్ణయించింది. అయితే బీసీసీఐ మాత్రం రూ. 45 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకు ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే మీడియా హక్కుల కోసం డిస్నీ, టీవీ-18 వయాకామ్, సోనీ-జీ, అమెజాన్ ప్రైమ్ మీడియా పోటీ పడుతున్నాయి. ఇందుకోసం అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ITT) పత్రాలను కూడా కొనుగోలు చేశాయి. తాజాగా ఈ హక్కుల కోసం  టెక్ దిగ్గజాలు యాపిల్, ఫేస్ బుక్ లతో పాటు విఖ్యాత ఓటీటీ ఫ్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ కూడా రేసులో ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. తొందరలోనే ఈ కంపెనీలు ఇన్విటేషన్ టు టెండర్ పత్రాలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఫార్ములా వన్ లో డ్రైవ్ టు సర్వైవ్ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తుంది.

గతంలోలాగా మీడియా రైట్స్ కోసం ఒక్కసారి బిడ్ వేస్తే సరిపోదు. ఈసారి మొత్తం నాలుగు బకెట్స్ కోసం విడివిడిగా బిడ్ వేయాల్సి ఉంటుంది.

బ్రాకెట్ ’ఎ‘ : భారత ఉపఖండంలో ప్రసారాలు : ఈ ప్యాకేజీ కోసం బేస్ ధర ఒక్కో గేమ్ కు రూ. 49 కోట్లు (మొత్తం 74 మ్యాచులు). ఐదేళ్లకు లెక్కన రూ. 18,130 కోట్లు.

బ్రాకెట్  ‘బి‘ : భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులు : ఒక్కో మ్యాచుకు రూ. 33 కోట్లు. ఐదేళ్లకు 12,210 కోట్లు

బ్రాకెట్ ’సి‘ : నాన్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ : 18 గేమ్ లను కలిగిఉన్న ఈ ప్యాకేజీ బండిల్ సీలో ఉంది. ఈ క్లస్టర్ లో ఒక్కో గేమ్ కు రిజర్వ్ ధర రూ. 16 కోట్లు. ఒక్కో సీజన్ కు రూ. 74 గేమ్ లు. ఈ లెక్కన ఐదేండ్ల పాటు రూ. 1,440 కోట్లు.

బ్రాకెట్’డి‘ : ఉపఖండం బయట (ప్రపంచవ్యాప్తంగా) : ఈ ప్యాకేజీలో ఒక్కో గేమ్ కు రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఐదేళ్లకు 1,110 కోట్లు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Amazon prime, Apple, Bcci, Chennai Super Kings, Facebook, IPL, IPL 2022, Mumbai Indians, Netflix, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు