Home /News /sports /

IPL 2022 IPL LIVE SCORES RCB PACER HARSHAL PATEL LEAVE BIO BUBBLE DUE TO HIS SISTER DEATH SJN

IPL 2022: ఆర్సీబీ స్టార్ బౌలర్ ఇంట్లో విషాదం... సోదరి మరణించడంతో ఇంటికి పయనమైన...

ఆర్సీబీ లోగో

ఆర్సీబీ లోగో

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హర్షల్ పటేల్ (Harshal Patel) ఇంట్లో విషాదం నెలకొంది. హర్షల్ పటేల్ సోదరి శనివారం రాత్రి మరణించినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హర్షల్ పటేల్ (Harshal Patel) ఇంట్లో విషాదం నెలకొంది. హర్షల్ పటేల్ సోదరి శనివారం రాత్రి మరణించినట్లు సమాచారం. శనివారం పుణేలోని స్టేడియంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా... అందులో హర్షల్ పటేల్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం అతడికి తన సోదరి మరణం గురించి తెలిసింది. ఈ క్రమంలో అతడు టీంతో కలిసి ముంబై వెళ్లకుండా... తన స్వస్థలానికి బయలుదేరినట్లు వార్తులు వస్తున్నాయి. అతడు తిరిగి ఈ ఈ నెల 12న జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే 12వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో ఆర్సీబీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో అతడు ఆ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో వారం రోజుల పాటు క్వారంటైన్ గడపాల్సి వస్తే... మరో రెండు మ్యాచ్ లకు హర్షల్ పటేల్ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి : సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా... ఓడినా... కావ్యపై మాత్రం సెటైర్లు ఆగడం లేదబ్బా!

పీటీఐ సమాచారం ప్రకారం... హర్షల్ పటేల్ శనివారం రాత్రే తన స్వస్థలం గుజరాత్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అతడు తిరిగి జట్టుతో కలుస్తాడని సమాచారం. హర్షల్ పటేల్ సోదరి మరణ వార్త తెలిశాక... ఆర్సీబీ అభిమానులతో పాటు ఐపీఎల్ అభిమానులు కూడా హర్షల్ పటేల్ కు అండగా నిలిచారు. దృఢంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.



ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చిన అతడు రెండు వికెట్లు తీశాడు. ఇందులో రోహిత్ శర్మ వికెట్ కూడా ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ పై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ఓడిన బెంగళూరు అనంతరం హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక వరుసగా నాలుగు ఓటములతో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Mumbai Indians, Royal Challengers Bangalore, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు