Home /News /sports /

IPL 2022 IPL GOVERNING COUNCIL ON FRIDAY RELEASED NEW FORMAT OF IPL 2022 SEASON SJN

IPL 2022: ఐపీఎల్ కొత్త ఫార్మాట్ అదిరిపోలా... లీగ్ లో తొలిసారి సీడింగ్ పద్దతి... బీసీసీఐ ప్లాన్ అదిపోయిందిగా

ఐపీఎల్ లోగో (ఫైల్ ఫోటో)

ఐపీఎల్ లోగో (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ కు సంబంధించిన ఫార్మాట్ ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శుక్రవారం విడుదల చేసింది. గతంలో లాగా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్ గా టోర్నీ సాగనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చదవి తెలుసుకోండి

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ కు సంబంధించిన సరికొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే సీజన్ వేదికలు,  ఎప్పుడు ఆరంభమవుతోందో చెప్పేసిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL Governing Council) తాజాగా టోర్నీ ఫార్మాట్ (Format) గురించి కూడా చెప్పేసింది. ఈ ఏడాది నుంచి రెండు కొత్త జట్లు బరిలోకి రావడంతో గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి ఫార్మాట్ మారింది. గతంలో 8 జట్లు కూడా ఒకే గ్రూప్ లో ఉండి... ఒక టీమ్ మరో ఏడు జట్లతో రెండేసి మ్యాచ్ లను ఇంటా, బయట పద్ధతిన ఆడేవి. అయితే తాజాగా రెండు జట్లు గుజరాత్ టైటాన్స్ (Gujarat titans), లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants,) జట్లు చేరడంతో 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించారు. మార్చి 26న ఆరంభం కానుండగా... మే 29న జరిగే ఫైనల్ తో సీజన్ కు శుభం కార్డు పడనుంది. జట్టు ఏ గ్రూప్ లో ఉందో... ఎలా విభజించారో తెలుసుకోవాలంటే చదవండి

తొలిసారి సీడింగ్ పద్ధతి

టెన్నిస్ (Tennis), బ్యాడ్మింటన్ (Badminton) స్పోర్ట్స్ లలో ఎక్కువగా ఉపయోగించే సీడింగ్ పద్ధతిని ఐపీఎల్ లో కూడా ఉపయోగించారు. మొత్తం గ్రూప్ ’ఎ‘, ’బి‘లలో ఐదేసి చొప్పున 10 జట్లను విడదీశారు.  టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో ర్యాంక్ ప్రకారం ఆటగాళ్లకు సీడింగ్ కేటాయిస్తారు. అయితే ఐపీఎల్ లో మాత్రం జట్లు గెలిచిన ఐపీఎల్ టైటిల్స్ ప్రకారం సీడింగ్ కేటాయించారు. దాంతో ఐపీఎల్ టైటిల్ ను 5 సార్లు గెలుచుకొని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు టాప్ సీడింగ్ దక్కింది. 4 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kikngs)కు రెండో సీడింగ్... రెండు సార్లు నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders)కు మూడో సీడింగ్... ఒక్కోసారి నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers hyderabad)కు నాలుగో సీడింగ్... రాజస్తాన్ రాయల్స్ (rajastan royals)కు ఐదో సీడింగ్ దక్కింది. ఐపీఎల్ ఫైనలిస్ట్స్ ఆర్సీబి ( Royal Challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals), పంజాబ్ కింగ్స్ (Punjab kings) జట్లకు వరుసగా 6, 7, 8 సీడింగ్స్ దక్కాయి. ఇక  కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కు 9వ సీడింగ్ దక్కగా... గుజరాత్ టైటాన్స్ కు పదో సీడింగ్ దక్కింది. గ్రూప్ ’ఎ‘లో ముంబై, కోల్ కతా, రాజస్తాన్, ఢిల్లీ , లక్నో జట్లు ఉండగా... గ్రూప్ ’బి‘లో  చెన్నై, హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.

ఫార్మాట్ ఎలా ఉంటుంది

ఎప్పటిలానే ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్ లను ఇంటా, బయట పద్ధతిన ఆడుతుంది. అయితే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. ఈ ఏడాది 10 జట్టను ఐదేసి చొప్పున రెండు గ్రూప్ లుగా విభజించారు. దాంతో గ్రూప్ లోని ఒక టీమ్... తమ గ్రూప్ లోని ఇతర నాలుగు జట్లతో రెండేసి చొప్పున 8 మ్యాచ్ లన ఆడుతుంది. అనంతరం పక్క గ్రూప్ లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడి... ఒక టీమ్ తో మాత్రం రెండు మ్యాచ్ లను ఆడుతుంది. దాంతో ఒక్కో టీమ్ లీగ్ లో 14 గ్రూప్ మ్యాచ్ లను ఆడుతుంది. అయితే ఈ 10 జట్లను కూడా పాయింట్ల పట్టికలో ఒకే గ్రూప్ కింద ఉంచుతారు. దాంతో పాయింట్ల ప్రకారం టాప్ 4లో ఉన్న నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి.


ఉదాహరణకు ముంబై ఇండియన్స్... తన గ్రూప్ లో ఉన్న మిగిలిన నాలుగు జట్లు (కోల్ కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో) జట్లతో రెండేసి మ్యాచ్ లను ఆడుతుంది. అనంతరం తన పక్క గ్రూప్ లో ఉన్న నాలుగు జట్ల (సన్ రైజర్స్, గుజరాత్, బెంగళూరు, పంజాబ్)తో ఒక్కో మ్యాచ్ ఆడుతుందనుకుంటే... మరో టీమ్ అయిన చెన్నై తో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అయితే పక్క గ్రూప్ లో ఉన్న ఏ జట్టుతో రెండేసి మ్యాచ్ లు ఆడాలి... ఏ జట్లతో ఒక్కో మ్యాచ్  ఆడాలి అనేది తొందర్లోనే తెలిసే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు... అనంతరం నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు మొత్తంగా 74 మ్యాచ్ లు ఈ ఏడాది ఐపీఎల్ లో జరగనున్నాయి. 2011లో కూడా ఇదే ఫార్మాట్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఆ ఏడాది కొచ్చి టస్కర్స్, పుణే వారియర్స్ రూపంలో రెండు కొత్త జట్లు ఐపీఎల్ లో చేరాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Indian premier league, IPL, Mumbai Indians, Punjab kings, Royal Challengers Bangalore, Sun risers hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు