IPL 2022 INDIAN FORMER CRICKETER VIRENDER SEHWAG SLAMMED ON TWITTER FOR ABHI TAK TOH YEH YADAVON KI IPL RAHI HAI COMMENT SJN
IPL 2022: ’ఇది యాదవుల ఐపీఎల్‘... సెహ్వాగ్ ట్వీట్ పై ఫ్యాన్స్ ఫైర్..
వీరేంద్ర సెహ్వాగ్ (ఫైల్ ఫొటో)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆరంభ మ్యాచ్ లో పెద్దగా మెరుపులు కనిపించకపోయినా... సూపర్ సండే నాడు జరిగిన రెండు మ్యాచ్ లు కూడా క్రికెట్ అభిమానులకు డబుల్ కిక్క్ ను ఇచ్చాయి.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆరంభ మ్యాచ్ లో పెద్దగా మెరుపులు కనిపించకపోయినా... సూపర్ సండే నాడు జరిగిన రెండు మ్యాచ్ లు కూడా క్రికెట్ అభిమానులకు డబుల్ కిక్క్ ను ఇచ్చాయి. మొదట ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) మధ్య సూపర్ మ్యాచ్ జరగ్గా... ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore), పంజాబ్ కింగ్స్ (Punjab kings) మధ్య థ్రిల్లర్ మూవీని తలపించే రేంజ్ లో మ్యాచ్ జరిగింది. ఈ రెండింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. తొలుత ఓడిపోతుందనుకున్న ఢిల్లీని లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ లు తమ అసమాన బ్యాటింగ్ తో గెలిపిస్తే... ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో కరీబియన్ వీరుడు ఒడెన్ స్మిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ముంబై, ఢిల్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (Virender sehwag) చేసిన ఓ ట్వీట్ దుమారం లేపింది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లతో చెలరేగాడు. తొలి ఓవర్లలోనే గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను తీశాడు. అనంతరం మరో వికెట్ ను తీసి చెన్నై భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. ఇక ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో చెనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో మెరిశాడు. 2019 తర్వాత అతడు ఓ మ్యాచ్ లో మూడు వికెట్ల తీయడం ఇదే తొలిసారి. అనంతరం ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి కోరల్లో చిక్కుకున్న సమయంలో లలిత్ యాదవ్ సూపర్ నాక్ తో అదరగొట్టాడు. 48 పరుగులతో అజేయంగా నిలిచి... అక్షర్ పటేల్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ముగ్గురి ప్రదర్శనను ఉటంకిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ’ప్రస్తుతం యాదవుల ఐపీఎల్ జరుగుతుంది‘అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.
Abhi tak toh yeh Yadavon ki IPL rahi hai.
Very happy for two hardworking guys, Umesh yesterday and Kuldeep today #DCvMI
అయితే ఇతడి ట్వీట్ పై క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. క్రికెట్ కు ప్రాంతం, కులాన్ని అంటగట్టడం మంచిది కాదని కొందరు అభిమానులు సెహ్వాగ్ ట్వీట్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే... ఉమేశ్, లలిత్, కుల్దీప్ ముగ్గురు కూడా వారి జట్ల తరఫున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. వారి ప్రతిభను పొగిడేలా సెహ్వాగ్ ఆ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ కొందరు అభిమానులను మాత్రం రెచ్చగొట్టేలా చేసింది. దాంతో వారు సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్ ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.