IPL 2022 HYDERABAD CRICKETER TILAK VERMA INSPIRING JOURNEY FROM TENNIS BALL CRICKET TO MUMBAI INDIANS SJN
IPL 2022: విరిగిన బ్యాట్ తో ప్రాక్టీస్... కట్ చేస్తే ముంబై తరఫున ఐపీఎల్ లో అరంగేట్రం.. అదీ తెలుగోడి సత్తా
తిలక్ వర్మ (ఫైల్ ఫోటో)
IPL 2022: తిలక్ వర్మ క్రికెట్ కెరీర్ టెన్నిస్ బాల్ తో మొదలైంది. ఆ సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ ను చూసిన అతడి కోచ్... తిలక్ వర్మ బ్యాటింగ్ పై ముచ్చట పడ్డాడు. బంతిని మిడిల్ చేయడంలో తిలక్ వర్మ సూపర్ సక్సెస్ అవుతుండటం... చక్కటి షాట్లు ఆడటం కోచ్ ను ఇంప్రెస్ చేశాయి.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడాలన్నది చాలా మంది యువ క్రికెటర్లకు కలగా ఉంటుంది. ఐపీఎల్ లో రాణిస్తే టీమిండియా (Team India)లో సెలెక్ట్ అవ్వడానికి మార్గం సుగుమం అవుతుందని ప్రతి యువ క్రికెటర్ కూడా భావిస్తాడు. ఐపీఎల్ టార్గెట్ గా యువ ప్లేయర్స్ తమ క్రికెట్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీలు అయిన రంజీల్లో, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో భారీగా పరుగులు సాధించి ఐపీఎల్ కు సన్నద్ధమవుతారు. ఈ కోవలోకే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ వస్తాడు. టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఆరంభించి కష్టాలను ఎదురించి ముంబై ఇండియన్స్ వరకు సాగిన అతడి ప్రస్థానం అద్భుతం
తిలక్ వర్మ క్రికెట్ కెరీర్ టెన్నిస్ బాల్ తో మొదలైంది. ఆ సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ ను చూసిన అతడి కోచ్... తిలక్ వర్మ బ్యాటింగ్ పై ముచ్చట పడ్డాడు. బంతిని మిడిల్ చేయడంలో తిలక్ వర్మ సూపర్ సక్సెస్ అవుతుండటం... చక్కటి షాట్లు ఆడటం కోచ్ ను ఇంప్రెస్ చేశాయి. వెంటనే అతడు తిలక్ వర్మ వాళ్ల పేరెంట్స్ తో మాట్లాడాడు. తిలక్ వర్మలో గొప్ప క్రికెటర్ ఉన్నాడని కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ గా ఎదిగే అవకాశం ఉందని కోచ్ తిలక్ వర్మ పేరెంట్స్ కు చెప్పాడు.
అందుకు తిలక్ వర్మ పేరెంట్స్ ఒప్పుకోవడంతో అతడు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ కుటుంబం ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉంది. దాంతో తిలక్ వర్మ కోచే బ్యాట్, ప్యాడ్స్ తో పాటు క్రికెట్ కు అవసరమైన వాటిిని ఏర్పాటు చేశాడు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు తిలక్ వర్మ దగ్గర ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్‌తో అతికించి దానిని వాడుకునేవాడిని.
అయితే పట్టుదలతో క్రికెట్ ను ప్రాక్టీస్ చేసిన తిలక్ వర్మ తక్కువ సమయంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. 19 ఏళ్ల తిలక్ వర్మ లిస్ట్ ఏ కెరీర్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌ల్లో 784 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 156 నాటౌట్ ఇతడికి అత్యధికం. ఇక టి20 కెరీర్లో 15 మ్యాచ్‌ల్లో 381 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 75. 143.77 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడగల సత్తా తిలక్ వర్మ సొంతం.
గత నెలలో జరిగిన వేలంలో తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. తిలక్ వర్మ మీద ఉన్న నమ్మకంతో ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఆడే తొలి మ్యాచ్ లోనే రోహిత్ అతడికి చాన్స్ ఇచ్చాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.