హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - CSK : ఈ లెక్కన ఆడితే ధోని జట్టుకు ప్లే ఆఫ్స్ చాన్స్ పక్కా.. అయితే చిరకాల ప్రత్యర్థి నుంచి సాయం కావాల్సిందే..

IPL 2022 - CSK : ఈ లెక్కన ఆడితే ధోని జట్టుకు ప్లే ఆఫ్స్ చాన్స్ పక్కా.. అయితే చిరకాల ప్రత్యర్థి నుంచి సాయం కావాల్సిందే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. (IPL Twitter)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. (IPL Twitter)

IPL 2022 - CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. నెల రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తోన్న ఈ ధనాధన్ లీగ్  తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 6 జట్లు సీజన్ లో  11 మ్యాచ్ లు ఆడేశాయి.

IPL 2022 - CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ హోరాహోరీగా సాగుతోంది. నెల రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తోన్న ఈ ధనాధన్ లీగ్  తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 6 జట్లు సీజన్ లో  11 మ్యాచ్ లు ఆడేశాయి. మిగిలిన నాలుగు జట్లు 10 మ్యాచ్ లు ఆడాయి. ఆదివారం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్ లతో ఆ నాలుగు కూడా లీగ్ లో 11 మ్యాచ్ లు ఆడేస్తాయి. దాంతో లీగ్ లో ఒక్కో జట్టు మరో మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు గ్రూప్ టేబుల్ లో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు ఒక్కో విజయాన్ని  సొంతం చేసుకుంటే.. ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి.

ఇది కూడా చదవండి  : ఇదేం స్టయిల్ రా బాబు.! ప్యాంట్ పై అండర్ వేర్ తో దర్శనమిచ్చిన 4 సార్లు ఎఫ్1 చాంపియన్.. కారణం అదేనా?

అయితే మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ రసవత్తరంగా జరుగుతోంది. ఒక్క ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాత్రం ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. దాంతో మూడు నాలుగు స్థానాల కోసం ఏకంగా ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్ ల్లో ఏడు పరాజయాలు మూడు విజయాలతో 6 పాయింట్లతో గ్రూప్ లో 7వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. అయితే దానికి ఈ కింది విషయాలు జరగాలి.


  1. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తాను ఆడే మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లోనూ భారీ తేడాతో గెలుపొందాలి. ఆ లెక్కన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ ముగిసే నాటికి 14 పాయింట్లతో ఉంటుంది.

  2. ఇక ముంబై ఇండియన్స్ తాను ఆడే నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించాలి. అదే సమయంలో ఈ నెల 12న చెన్నై తో జరిగే మ్యాచ్ లో ముంబై జట్టు ఓడిపోవాలి.

  3. ఇక అదే సమయంలో లక్నో, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ జట్లు ఇకపై తాము ఆడే అన్ని మ్యాచ్ ల్లోనూ గెలవాలి.

  4. ఇక ఢిల్లీ, సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తాము ఆడే అన్ని మ్యాచ్ ల్లోనూ ఓడాల్సి ఉంటుంది.


పై విధంగా జరిగితే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు మరో రెండు జట్లు 14 పాయింట్లతో గ్రూప్ లో నాలుగో స్థానంలో నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. చెన్నై భారీ తేడాతో గెలిచినట్లు అయితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Jasprit Bumrah, Kane Williamson, MS Dhoni, Mumbai Indians, Ravindra Jadeja, Rohit sharma, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు