Home /News /sports /

IPL 2022 HOMBALE FILMS PROUD AND ECSTATIC TO ASSOCIATE WITH ROYAL CHALLENGERS BANGALORE AND TEASER GOES VIRAL SRD

RCB - KGF : ఏందీ సామీ ఈ కాంబినేషన్.. చేతులు కలిపిన ఆర్సీబీ-కేజీఎఫ్.. రాఖీబాయ్ గా కోహ్లీ.. టీజర్ అదుర్స్

Royal Challengers Bangalore (Twitter)

Royal Challengers Bangalore (Twitter)

RCB - KGF : 1:23 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో- కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. కేజీఎఫ్ యాక్టర్స్.. ఆర్సీబీ ప్లేయర్లను మిక్స్ చేస్తూ దీన్ని చిత్రీకరించింది.

    ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ఫ్యాన్స్ కు కావాల్సిన బోలెడంత మజా అందిస్తోంది. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండటంతో ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరుకు 18 మ్యాచులు జరిగాయ్. ఇక, ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అదరగొడుతోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుని పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో ఓటమి తర్వాత.. మిగిలిన మూడు మ్యాచుల్లో నెగ్గి తగ్గేదేలే అంటుంది డుప్లెసిస్ సేన. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా కన్పిస్తోన్న ఆర్సీబీ ఈ సారి టైటిల్ ఫేవరెట్ గా కన్పిస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని విజయాలను అందుకుంటోంది. ఇప్పటికే వరుస విజయాలతో సంతోషంగా ఉన్న ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.

    శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ హొంబలె ఫిల్మ్స్‌ (Hombale Films)తో జట్టు కట్టినట్టు ప్రకటించింది ఆర్సీబీ. హొంబలె ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌ను నిర్మించింది ఈ నిర్మాణ సంస్థే. ఫస్ట్ పార్ట్‌కు సీక్వెల్‌గా నిర్మించిన కేజీఎఫ్‌ చాఫ్టర్ 2 ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీకి కొద్దిరోజుల ముందే- హొంబలె ఫిల్మ్స్.. రాయల్ ఛాలెంజర్స్‌ ఫ్రాంఛైజీతో అసోసియేట్ అయినట్లు తెలిపింది.

    ఇది కూడా చదవండి : వారెవ్వా.. భర్త ఐపీఎల్ లో దుమ్మురేపుతుంటే.. భార్య చరిత్ర సృష్టించింది..

    ఈ విషయాన్ని వెల్లడించడానికి హొంబలె ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్.. ఓ అద్దిరిపోయే టీజర్ ను రూపొందించింది. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 1:23 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో- కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. కేజీఎఫ్ యాక్టర్స్.. ఆర్సీబీ ప్లేయర్లను మిక్స్ చేస్తూ దీన్ని చిత్రీకరించింది. పవర్‌ఫుల్ అధీరా క్యారెక్టర్‌లో నటించిన సంజయ్ దత్, ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రవీనా టండన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యష్, విరాట్ కోహ్లీల కాంబినేషన్‌ను ఇందులో అద్భుతంగా మిక్స్ చేశారు.


    శాండిల్‌వుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతోంది హొంబలె ఫిల్మ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీతో జట్టు కట్టడం వల్ల అటు చిత్ర పరిశ్రమ, ఇటు స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో జాయింట్‌గా ప్రమోషన్లు చేయడం, సినిమాలను నిర్మించడం, మల్టీ ఫార్మట్‌ కంటెంట్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్‌లను షూట్ చేయడం.. వంటి కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు ఉంటుంది. ఇప్పటికే కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన హొంబలె ఫిల్మ్స్ ప్రభాస్ తో సలార్ సినిమా కూడా నిర్మిస్తోంది. మొత్తానికి ఈ కాంబినేషన్ పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Faf duplessis, Glenn Maxwell, IPL 2022, KGF Chapter 2, Royal Challengers Bangalore, Sanjay Dutt, Virat kohli, Yash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు