Home /News /sports /

IPL 2022 HE HADNT EAT LUNCH FOR YEAR COACH SANJAY BHARADWAJ REVEALS MUMBAI INDIANS SPINNER KARTHIKEYA SINGH HEART TOUCHING STORY SJN

IPL 2022 : ఏడాది పాటు లంచ్ చేయలేదు.. 10 రూపాయల బిస్కెట్స్ కోసం మైళ్ల కొద్ది నడక.. కంటతడి పెట్టించే ముంబై మిస్టరీ స్పిన్నర్ కథ

కుమార్ కార్తికేయ సింగ్ (PC : TWITTER)

కుమార్ కార్తికేయ సింగ్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున కుమార్ కార్తీకేయ సింగ్ అరంగేట్రం చేశాడు.

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున కుమార్ కార్తీకేయ సింగ్ అరంగేట్రం చేశాడు. జట్టులోని ఒకరు గాయపడటంతో అతడి స్థానంలో కార్తికేయ సింగ్ ను ఎంపిక చేస్తూ ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకుంది. జట్టులోకి తీసుకోవడమే కాదు.. రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం కూడా చేయించింది. అరంగేట్రం మ్యాచ్ తోనే కార్తికేయ సింగ్ వైవిధ్యమైన బంతులతో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే అతడు ఇక్కడి వరకు చేరుకోవడానికి పడిన కష్టాల గురించి తెలిస్తే మాత్రం మన కళ్లు చెమర్చక మానదు. క్రికెటర్ అయ్యేందుకు కార్తికేయ ఎటువంటి త్యాగాలు చేశాడో.. ఎటువంటి పరిస్థితులను ఎదర్కొన్నాడనే విషయాలపై అతడి కోచ్ సంజయ్ భరద్వాజ్ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు.

ఇది కూడా చదవండి : నువ్వు భువీ అయితే నాకేంటీ.. నేను వార్నర్.. డేవిడ్ వార్నర్! క్షణంలో ప్లాన్ ఎలా మార్చాడో మీరే చూడండి..

కాన్పూర్ కు చెందిన కార్తికేయ సింగ్ కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం. అయితే అతడి తండ్రి ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండటంతో అతడి కలకు ఆదిలోనే బ్రేక్ పడింది. అయితే క్రికెటర్ కావాలనే గట్టి పట్టుదలతో ఉన్న కార్తికేయ సింగ్.. తన కుటుంబానికి భారం కాకూడదనే తలంపుతో 15 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా ఢిల్లీకి చేరుకున్నాడు. అయితే అక్కడ రాధేశ్యామ్ అనే లీగ్ క్రికెటర్ తప్ప కార్తికేయకు ఎవరూ తెలియదు. ఇద్దరు కలిసి చాలా అకాడమీలకు వెళ్లారు. అయితే ప్రతి అకాడమీ కూడా కార్తికేయకు కోచింగ్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో ఫీజును డిమాండ్ చేసింది. దాంతో వీరికి నిరాశే ఎదురైంది. చివరకు సంజయ్ భరద్వాజ్ దగ్గరకు వీరు వెళ్లారు. అక్కడ కార్తికేయ గురించి రాధేశ్యామ్ సంజయ్ కు వివరించాడు. దాంతో అతడికి ట్రయల్స్ లో పాల్గొనే అవకాశాన్ని సంజయ్ ఇచ్చాడు. ట్రయల్స్ లో కార్తికేయ వేసిన ఒకే ఒక బంతితో సంజయ్ అతడికి కోచింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి : ’ ఛీ.. ఛీ.. ఇంత దారుణమా‘ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన థర్డ్ అంపైర్.. ఎలాగంటే?

కోచ్ దొరకడంతో.. ఉండటానికి స్థలం అదే విధంగా రోజు ఖర్చుల కోసం ఒక పనిని వెతుకున్నాడు కార్తికేయ. అయితే అది కోచింగ్ తీసుకునే చోటుకు చాలా దూరం ఉండేది. పగలంతా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసే కార్తికేయ సింగ్.. రాత్రి ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఇక రూ. 10 రూపాయలు మిగుల్చుకోవడానికి తాను ఉండే చోటు నుంచి గ్రౌండ్ కు నడక సాగించేవాడు. ఇలా దాదాపు ఏడాది పాటు అతడు మధ్యాహ్నం భోజనం తినకుండానే క్రికెట్ ను సాధన చేశాడు. చివరకు కార్తికేయ పడుతున్న కష్టాన్ని గమనించిన కోచ్ సంజయ్.. తన అకాడమీ కుక్ తో కలిసి ఉండేందుకు అవకాశం ఇచ్చాడు. తొలి రోజు ఆ కుక్ కార్తికేయకు మధ్యాహ్నం తినడానికి భోజనం ఇవ్వగా.. అతడు వెంటనే ఏడవడం మొదలు పెట్టాడట. తాను మధ్యాహ్నం భోజనం తిని ఏడాదిపైనే అవుతుందని తనకు ఆ సందర్భంలో చెప్పాడని సంజయ్ తెలిపాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mohammed Siraj, Mumbai Indians, Rashid Khan, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు