Home /News /sports /

IPL 2022 HARDIK PANDYA NEWS GUJARAT TITANS CAPTAIN HARDIK PANDYA BECOME EXPENSIVE BOWLER AND DID SOME COSTLY MISTAKES AGAINST PUNJAB KINGS SJN

IPL 2022: పాయె పరువు పాయె.. స్పిన్నర్ చేతిలో హార్దిక్ పరువు గంగలో కలిసి పాయె.. ఇవే తగ్గించుకుంటే మంచిది

హార్దిక్ పాండ్యా (PC: IPL)

హార్దిక్ పాండ్యా (PC: IPL)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పరువు గంగలో కలిసి పోయింది. అది కూడా ఓ స్పిన్నర్ చేతిలో... తాజా ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పరువు గంగలో కలిసి పోయింది. అది కూడా ఓ స్పిన్నర్ చేతిలో... తాజా ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ జట్టును విజేతగా నిలిపాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంతే కాకుండా లీగ్ లో ఓటమి లేని ఏకైక జట్టుగా ముందుకు నడుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ఆటగాడిగా హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించడం లేదు. మునుపటిలా భారీ షాట్లతో విరుచుకుపడటం లేదు. వెన్నెముక సర్జరీ తర్వాత బౌలింగ్ కు దూరమైన పాండ్యా... 2022 సీజన్ లో మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా ఇంకా చెప్పాలంటే ఫీల్డర్ గా కూడా విఫలమై అతడి అభిమానులను నిరాశ పరిచాడు.

పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచినా... హార్దిక్ పాండ్యా మాత్రం మూడు విభాగాల్లోనూ విఫలమయ్యాడు. ముఖ్యంగా 20వ ఓవర్ వేయడానికి వచ్చిన హార్దిక్ ను పంజాబ్ బౌలర్లు ఉతికి ఆరేశారు. ముఖ్యంగా రాహుల్ చహర్ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే రావాల్సిన చోట తన అతి విశ్వాసంతో మూడు పరుగులు వచ్చేలా చేశాడు. ఒక వేళ మ్యాచ్ లో తెవాటియా ఆఖరి బంతికి సిక్సర్ కొట్టకుండా ఫోర్ కొట్టింటే... ఏమైయ్యేది. మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది కాబట్టి హార్దిక్ పాండ్యా తప్పులు కనబడటం లేదు. అదే ఓడిపోయింటే మాత్రం... దానికి 100 శాతం కారణం హార్దిక్ పాండ్యా నే అయ్యేవాడు.



ఇక లివింగ్ స్టోన్ క్యాచ్ విషయంలోనూ హార్దిక్ పాండ్యా కాస్త అతి చేసినట్లు కనిపిస్తుంది. అలా అని హార్దిక్ పట్టిన క్యాచ్ ను తక్కువ చేసి చూపలేము. అయితే రీప్లేలో చూసినట్లయితే హార్దిక్ ఆ క్యాచ్ ను సింపుల్ గానే తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపించింది. అనవసరంగా గెంతి బౌండరీ లైన్ తాకినట్లు కనిపించింది. ఆ క్యాచ్ కాస్తా నౌటౌట్ గా తేలడం... అనంతరం లివింగ్ స్టోన్ చిచ్చరపిడుగులా చెలరేగిపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ ను సాధించింది. ఛేదనలో శుబ్ మన్ గిల్ 96 పరుగలు చేసినా ఆఖరి బంతి వరకు కూడా పంజాబ్ కింగ్స్ జట్టే విన్నర్ గా కనిపించింది. అయితే తెవాటియా అసాధారణ హిట్టింగ్ కు తోడు ఒడెన్ స్మిత్ చెత్త బౌలింగ్ గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని కట్టబెట్టేలా చేసింది. చూస్తుంటే ఈ సీజన్ లో కూడా పంజాబ్ గత సీజన్ లో మాదిరే... గెలుపు వరకు వచ్చి మునిగిపోయేలా కనిపిస్తోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Punjab kings

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు