IPL 2022 GT VS MI LIVE SCORE UPDATES MUMBAI INDIANS SETS FIGHTING TOTAL ON SCORE BOARD SRD
IPL 2022 - GT vs MI : ఫస్ట్ లో అదరగొట్టి.. ఆ తర్వాత తడబడ్డ ముంబై బ్యాటింగ్.. గుజరాత్ టార్గెట్ ఇదే..
Mumbai Indians ( IPL Twitter)
IPL 2022 - GT vs MI : ఫస్ట్ పవర్ ప్లేలో రోహిత్, ఇషాన్ ల విధ్వంసం.. మధ్యలో పొలార్డ్ జిడ్డు బ్యాటింగ్.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు బ్యాటింగ్.. ఇలా కొనసాగింది ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్.
బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న పోరులో ముంబై మంచి ఫైటింగ్ టోటల్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. టిమ్ డేవిడ్ ( 21 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లతో మరో సారి తన మ్యాజిక్ చూపించాడు. జోసెఫ్, సంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్ తలా వికెట్ దక్కించుకున్నారు.టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు దూకుడైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ కళాత్మక విధ్వసం కొనసాగించాడు. వీలు చిక్కినప్పుడల్లా ఇషాన్ కిషన్ కూడా బౌండరీలు బాదాడు. ఈ ఇద్దరి దూకుడికి 6 ఓవర్లలోనే 63 పరుగులు చేసింది.
అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రషీద్ ఖాన్ విడదీశాడు. సూపర్ టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. రషీద్ ఎల్బీ అప్పీల్‌ను తొలుత అంపైర్ తిరస్కరించగా.. రివ్యూలో రోహిత్ ఔటైనట్లు స్పష్టంగా తేలింది. దీంతో.. 74 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది ముంబై. అయితే.. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపర్చాడు. 99 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 13; సిక్సర్) ఔటయ్యాడు.
ఆ కాసేపటికే ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. ఇక, ఆ తర్వాత వచ్చిన పొలార్డ్ తన జిడ్డు బ్యాటింగ్ తో ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. 14 బంతుల్లో 4 పరుగులు చేశాడు. అపోసోపాలు పడుతూ బ్యాటింగ్ చేసిన పొలార్డ్ ను రషీద్ ఖాన్ అద్భుతమైన బంతితో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో.. 119 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఆఖర్లో టిమ్ డేవిడ్ తన మెరుపు బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ కు మంచి స్కోరు అందించాడు.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్, మహమ్మద్ షమీ
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.