IPL 2022 GT VS MI LIVE SCORE UPDATES GUJARAT TITANS WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
IPL 2022 - GT vs MI : రోహిత్ వర్సెస్ హార్ధిక్ పోరుకు ఊరంతా సిద్ధం.. టాస్ గెలిచిన గుజరాత్..
IPL 2022 - GT vs MI
IPL 2022 - GT vs MI : టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ టేబుల్ లోయర్స్ ముంబై ఇండియన్స్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్ రేసులో భాగంగా గుజరాత్ కి ఇది కీలక మ్యాచ్.
ఐపీఎల్ 2022 సీజన్ లో మరికాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్ తో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. హృతిక్ సోకిన్ స్థానంలో మురుగన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముంబై గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 5వికెట్ల తేడాతో ఓడించగా, గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఇక, ఎనిమిది ఓటముల తర్వాత సీజన్లో ఆర్ఆర్పై గెలిచి తమ గెలుపు ఖాతాను ముంబై మొదలుపెట్టింది.
ఈ సీజన్లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో.. మిగత మ్యాచుల్లో గెలిచి కనీస పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ముంబై టీమ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యాలు అందించడంలో విఫలమవుతున్నారు. ఈ ఇద్దరూ ఈ మ్యాచ్ లోనైనా సత్తా చాటాలని ముంబై ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు సూపర్ ఫామ్ లో ఉండటం ముంబైకి ప్లస్ పాయింట్. ఇక, పొలార్డ్ ఫామ్ లేమి కూడా ముంబైని వేధిస్తోంది. ఈ కరేబియన్ హిట్టర్ ఈ సీజన్ లో ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరో హిట్టర్ టిమ్ డేవిడ్ గత మ్యాచులో ఫర్వాలేదన్పించాడు. ఇక, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్ పేస్ బాధ్యతల్ని పంచుకోనున్నారు. మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనే సక్సెస్ ఫుల్ టీంగా కొనసాగుతుంది. ఈ టీంలో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారు. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓడిపోవడంతో ఆ టీం విజయాలకు బ్రేక్ పడింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సాహా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. సాయి సుదర్శన్, హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ మంచి టచ్ లో ఉన్నారు. ఆఖర్లో మెరుపులు మెరిపించడానికి రాహుల్ తేవటియా, రషీద్ ఖాన్ సై అంటున్నారు. ఇక, షమీ, లూకీ ఫెర్గ్యూసన్, అల్జరీ జోసెఫ్ వంటి టాప్ పేసర్లు గుజరాత్ సొంతం. రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఆ జట్టులో ఉండటం వారికి సానుకూలాంశం.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్, మహమ్మద్ షమీ
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.