Home /News /sports /

IPL 2022 GT VS MI HIGHLIGHTS GUJARAT TITANS BATTER SAI SUDHARSAN BECOME FIRST PLAYER IN IPL 2022 SEASON TO DISMISS VIA HIT WICKET SJN

IPL 2022 : ఎవరికీ ఇబ్బంది కలగకుండా తన వికెట్ ను తానే తీసుకున్న గుజరాత్ ప్లేయర్.. ఎలాగో చూసేయండి మరీ..

సుదర్శన్ (PC : TWITTER)

సుదర్శన్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటర్ సాయి సుదర్శన్ వినూత్న రీతిలో అవుటయ్యాడు. ఈ విధంగా ఒక ఆటగాడు తన వికెట్ ను సమర్పించుకోవడం క్రికెట్ లో చాలా అరుదుగా జరుగుతుంది.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటర్ సాయి సుదర్శన్ వినూత్న రీతిలో అవుటయ్యాడు. ఈ విధంగా ఒక ఆటగాడు తన వికెట్ ను సమర్పించుకోవడం క్రికెట్ లో చాలా అరుదుగా జరుగుతుంది. 14 పరుగుల వ్యక్తగత స్కోరు వద్ద గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ రూపంలో తన వికెట్ ను పారేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఇదే తొలి హిట్ వికెట్ అవ్వడం విశేషం. ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 16వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని తక్కువ పేస్ తో షార్ట్ పిచ్ బాల్ వేశాడు. ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన సుదర్శన్ తన బ్యాట్ తో వికెట్లను గిరాటేశాడు. దాంతో హిట్ వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు.

ఇది కూడా చదవండి  : నువ్వు భువీ అయితే నాకేంటీ.. నేను వార్నర్.. డేవిడ్ వార్నర్! క్షణంలో ప్లాన్ ఎలా మార్చాడో మీరే చూడండి..

ఈ సీజన్ ఐపీఎల్ లో ఇదే తొలి హిట్ వికెట్ కావడం విశేషం. ఇక మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ కు ఇది వరుసగా రెండో పరాజయం కాగా.. ముంబై ఇండియన్స్ కు ఇది వరుసగా రెండో విజయం. తాను హిట్ వికెట్ అయ్యాననే విషయాన్ని సుదర్శన్ జీర్ణించుకోలేకపోయాడు. అవుట్ అయ్యాక కొన్ని క్షణాల పాటు అలానే క్రీజులో ఉండిపోయాడు.



తొలుత బ్యాటింగ్ చేసిన  ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్‌), రోహిత్‌ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. టిమ్ డేవిడ్ ( 21 బంతుల్లో 44 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లతో మరో సారి తన మ్యాజిక్ చూపించాడు. జోసెఫ్, సంగ్వాన్, లూకీ ఫెర్గ్యూసన్ తలా వికెట్ దక్కించుకున్నారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. గిల్‌ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. హార్దిక్ పాండ్యా ( 14 బంతుల్లో 24 పరుగులు ; 4 ఫోర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. పొలార్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ విక్టరీతో ఈ లీగులో రెండో విజయాన్ని దక్కించుకుంది ముంబై.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Kolkata Knight Riders, Lucknow Super Giants, Mumbai Indians, Punjab kings, Rajasthan Royals, Rashid Khan, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు