IPL 2022 GT VS LSG LIVE SCORES GUJARAT TITANS BEAT LUCKNOW SUPERGAINTS BY 62 RUNS AND QUALIFY FOR THE PLAYOFFS SJN
LSG vs GT : 4 వికెట్లతో మాయ చేసిన రషీద్.. మరోసారి రాహుల్ పై హార్దిక్ దే పైచేయి.. ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్
రషీద్ ఖాన్ (PC : IPL)
LSG vs GT : మరోసారి కేఎల్ రాహుల్ (KL rahul)పై హార్దిక్ పాండ్యా (Hardik Pandya)దే పై చేయి అయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం కొత్త జట్ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)పై 62 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఘనవిజయం సాధించింది.
LSG vs GT : మరోసారి కేఎల్ రాహుల్ (KL rahul)పై హార్దిక్ పాండ్యా (Hardik Pandya)దే పై చేయి అయ్యింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం కొత్త జట్ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)పై 62 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ గుజరాత్ టైటాన్స్ దే విజయం కావడం విశేషం. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ (Rashid Khan) నాలుగు వికెట్లతో లక్నో నడ్డి విరిచాడు. సాయి కిషోర్, యశ్ దయాల్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్నో టీంలో దీపక్ హుడా (27), క్వింటన్ డికాక్ (11), అవేశ్ ఖాన్ (12) మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం విశేషం. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గత రెండు మ్యాచ్ ల్లో ఎదురైన ఓటములకు ఈ మ్యాచ్ తో హార్దిక్ పాండ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు. 18 పాయింట్లతో గుజరాత్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
లక్ష్యం చిన్నదే అయినా కూడా పిచ్ స్లోగా ఉండటంతో లక్నో జట్టు ఆరంభం నుంచే తడబడింది. గుజరాత్ తుది జట్టులోకి వచ్చిన యశ్ దయాల్.. డేంజరస్ క్వింటన్ డికాక్ ను పెవిలియన్ కు చేర్చి గుజరాత్ కు బ్రేక్ అందించాడు. మరికాసేపటికే కేఎల్ రాహుల్ ను షమీ అవుట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి లక్నో పతనం కొనసాగుతూనే పోయింది. దీపక్ హుడా ఒక ఎండ్ లో ఓపిగ్గా బ్యాటింగ్ చేసినా.. మరో ఎండ్ లో అతడికి సహకరించే వారు కరువయ్యారు. కరణ్ శర్మ (4), కృనాల్ పాండ్యా (5), ఆయుశ్ బదోని (8) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఇక ఆశలు పెట్టుకున్న స్టొయినస్ (2) సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. జేసన్ హోల్డర్ కూడా (1) పెవిలియన్ కు చేరడంతో లక్నో ఓటమి ఖాయమైంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. గుజరాత్ టీంలోనూ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆడలేకపోయారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (26; 1 ఫోర్ ,1 సిక్స్) రాణించాడు. రాహుల్ తెవాటియా (16 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కనబర్చడంతో గుజరాత్ స్కోరు 140 మార్కును దాటగలిగింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.