హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - GT vs DC : 84 పరుగులతో అదరగొట్టిన గిల్.. ఢిల్లీ ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - GT vs DC : 84 పరుగులతో అదరగొట్టిన గిల్.. ఢిల్లీ ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - GT vs DC : టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్న యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గిల్ సూపర్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

IPL 2022 - GT vs DC : టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్న యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గిల్ సూపర్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

IPL 2022 - GT vs DC : టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్న యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గిల్ సూపర్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.

  పుణె ఎంసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ ( 46 బంతుల్లో 84 పరుగులు ; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా ( 27 బంతుల్లో 31 పరుగులు; 4 ఫోర్లు) సత్తా చాటారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ రహ్మన్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. ఒక్క పరుగు చేసిన మాథ్యూ వేడ్‌ ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 2 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ జట్టుకు లాభం కన్నా నష్టమే చేశాడు. టీ20లో టెస్ట్ టైపు బ్యాటింగ్ చేశాడు. 20 బంతులాడిన విజయ్ శంకర్ 13 పరుగులు చేశాడు. అయితే, అతని రూపంలో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

  అయితే, మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ క్లాసిక్ బౌండరీలతో పాటు.. మాస్ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సహాకారం అందించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 65 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో గిల్ 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, 31 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రోవ్‌మెన్‌ పావెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, 109 పరుగులకు గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది.

  ఓవైపు వికెట్లు పడుతున్నా శుభ్ మన్ గిల్ ఏ మాత్రం తగ్గలేదు. అదిరిపోయే బ్యాటింగ్ తో చెలరేగాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వేసిన 16 వ ఓవర్ రెండు సిక్సర్లతో విరుచుకపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో తన అత్యధిక స్కోరు నమోదు చేసుకున్నాడు. అయితే, సెంచరీ దిశగా సాగుతున్న గిల్ జోరుకు ఖలీల్ అహ్మద్ బ్రేకులు వేశాడు. అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి.. బౌండరీ మీద అక్షర్ పటేల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు గిల్. ఆఖర్లో మిల్లర్, రాహుల్ తేవటియా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ మంచి స్కోరు సాధించింది.

  తుది జ‌ట్లు

  ఢిల్లీ క్యాపిట‌ల్స్‌: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, కేఎల్ భ‌ర‌త్, రిష‌బ్ పంత్ (కెప్టెన్‌, వికెట్ కీప‌ర్), ల‌లిత్ యాద‌వ్, రోవ్మాన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, ముస్తఫిజుర్ రహ్మన్ , ఖ‌లీల్ అహ్మ‌ద్.

  గుజ‌రాత్ టైటాన్స్‌: శుభ్‌మాన్ గిల్, మాథ్యువేడ్ (వికెట్ కీప‌ర్), విజ‌య్ శంక‌ర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్ల‌ర్, రాహుల్ తెవాటియా, అభిన‌వ్ మ‌నోహ‌ర్, ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ, వ‌రుణ్ అరోన్, లూకీ ఫెర్గ్యూసన్.

  First published:

  Tags: Cricket, Delhi Capitals, Gujarat Titans, Hardik Pandya, IPL 2022, Rishabh Pant

  ఉత్తమ కథలు