హోమ్ /వార్తలు /క్రీడలు /

Royal Challengers Bangalore : కోహ్లీ నోట అదిరిపోయే మాట.. ఆర్సీబీ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ బాసూ..!

Royal Challengers Bangalore : కోహ్లీ నోట అదిరిపోయే మాట.. ఆర్సీబీ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ బాసూ..!

Virat Kohli

Virat Kohli

Royal Challengers Bangalore : ఆర్సీబీ రాణిస్తున్నా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫామ్ ఆ జట్టును వేధిస్తోంది. విరాట్ కోహ్లీ కెరీర్ లోనే ఈ సీజన్ అత్యంత చెత్తది అని చెప్పొచ్చు. ఈ విషయాల్ని పక్కన పెడితే.. విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. మధ్యలో కాస్త తడబడ్డ ఇప్పుడు ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్తుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది. తదుపరి మ్యాచ్‌‌ల్లో ఆర్‌సీబీ పంజాబ్, గుజరాత్‌లతో తలపడనుంది. ఆర్సీబీ రాణిస్తున్నా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫామ్ ఆ జట్టును వేధిస్తోంది. విరాట్ కోహ్లీ కెరీర్ లోనే ఈ సీజన్ అత్యంత చెత్తది అని చెప్పొచ్చు. ఈ విషయాల్ని పక్కన పెడితే.. విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది. తదుపరి మ్యాచ్‌‌ల్లో ఆర్‌సీబీ పంజాబ్, గుజరాత్‌లతో తలపడనుంది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని చెప్పాడు కోహ్లీ.

  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలో విరాట్ కోహ్లీ- ఏబీ డివిలియర్స్ (AB de Villiers) జోడి సూపర్ పాపులర్. విలియర్స్ గతేడాది అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైరయ్యాడు. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం లేదు. బెంగళూరు అభిమానులు అతడిని బాగా మిస్ అవుతున్నారు. ఏబీడి ప్రాణ స్నేహితుడు విరాట్ కోహ్లీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఏబీడీని మిస్ అవుతున్న అభిమానుల కోసం విరాట్ కోహ్లీ ఇప్పుడు అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

  AB De Villiers - Virat Kohli

  RCB ఇన్‌సైడర్‌లో మాట్లాడుతూ, విరాట్ డివిలియర్స్‌ను మిస్ అవుతున్నట్లు అంగీకరించాడు. 'నేను అతన్ని చాలా మిస్ అవుతున్నాను. నేను అతనితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నాను. అతను ప్రస్తుతం అమెరికాలో అగస్టా మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఆస్వాదిస్తున్నాడు. అయితే.. అతను క్రమం తప్పకుండా RCB మ్యాచ్‌లను చూస్తుంటాడు. వచ్చే ఏడాది ఏబీడీని ఓ ప్రత్యేక పాత్రలో చూడొచ్చు' అని విరాట్ చెప్పాడు.

  ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా ఏబీడీ విలియర్స్ ఆర్‌సీబీకి మెంటార్‌గా ఉంటాడని చర్చ జరిగింది, కానీ అది జరగలేదు. ఇప్పుడు విరాట్ కోహ్లి ఈ విషయాన్ని సూచించడంతో వచ్చే సీజన్‌లో డివిలియర్స్ ఆర్సీబీ క్యాంపులో ప్రత్యేక రోల్ లో చూడొచ్చు. ఇక, విరాట్ కోహ్లీ స్టేట్ మెంట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 2011లో బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. ఆ టీమ్ తరఫున 150 మ్యాచ్‌లాడి ఏకంగా 4491 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ కెరీర్‌లో 184 మ్యాచ్‌లాడిన ఈ పవర్ హిట్టర్ 5162 పరుగులు చేయడం విశేషం.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Royal Challengers Bangalore, Virat kohli

  ఉత్తమ కథలు