IPL 2022: ఐపీఎల్ 2022 కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కొత్త బాధ్యతను స్వీకరించాడు. లక్నో ఫ్రాంచైజీ అతన్ని జట్టుకు మెంటార్‌గా చేసింది. గంభీర్ కెప్టెన్‌గా రెండుసార్లు కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆర్పీ సంజీవ్ గోయెంకా కూడా గంభీర్ రాకను దృవీకరించాడు.
ఐపీఎల్ (IPL) టైటిల్‌ను రెండు సార్లు గెలిచిన గౌతమ్ గంభీర్ (Gautham Gambhir).. క్రికెట్ (Cricket) నుంచి మూడేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఆ తర్వాత రాజకీయాల్లో చేరి బీజేపీ తరపున ఎంపీగా గెలిచాడు. ప్రస్తుతం ఎంపీగా ప్రజా సేవలో బిజీగా ఉన్న ఈ కేకేఆర్ (KKR) మాజీ కెప్టెన్.. తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్నాడు. 2018 డిసెంబర్ 3న రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్.. తాజాగా తిరిగి ఐపీఎల్లో భాగస్వామ్యం అవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. డిసెంబర్ 18న తన రీఎంట్రీ గురించి వివరిస్తూ ట్విట్టర్లో (Twitter) పోస్టు పెట్టాడు. అయితే ఈ సారి క్రికెటర్‌గా కాకుండా మెంటార్‌గా (Mentor) ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2022 నుంచి రెండు కొత్త జట్లు లీగ్‌లో అరంగేట్రం చేయబోతున్నాయి. వీటిలో లక్నో జట్టును (Lucknow Team) దక్కించుకున్న ఆర్పీఎస్జీ గ్రూప్ గౌతమ్ గంభీర్‌ను తమ జట్టు మెంటార్‌గా నియమించుకున్నది.
గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఆ జట్టు ఎప్పుడూ టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు గంభీర్ 2 ప్రపంచ కప్ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. రెండు టోర్నీల ఫైనల్స్‌లోనూ గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు అతను లక్నో జట్టుకు ప్రిపరేషన్లో సహాయం చేస్తాడు. ఆ జట్టు తొలిసారి లీగ్‌లోకి అడుగుపెట్టింది.
It’s a privilege to be in the contest again. Thanks Dr.Goenka for incl me in #LucknowIPLTeam as its mentor.The fire to win still burns bright inside me, the desire to leave a winner’s legacy still kicks me. I won’t be contesting for a dressing room but for the spirit & soul of UP
లక్నో ఫ్రాంచైజీ జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. గంభీర్ జట్టులో చేరడాన్ని జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ధృవీకరించారు. గౌతమ్ గంభీర్ కూడా తన ట్విట్టర్లో లక్నో జట్టులో చేరుతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా జట్టులో సహాయ కోచ్‌గా చేరనున్నాడు. ప్రస్తుతం యూపీ జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు.
జనవరిలో జరగనున్న మెగా వేలానికి ముందు తమతో పాటు ముగ్గురు ఆటగాళ్లను జట్టు చేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కేఎల్ రాహుల్ ఆ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతను జట్టుకు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ ముందుగానే సమాచారం ఇవ్వడంతో పంజాబ్ కూడా అతడిని చేసుకోలేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.