Home /News /sports /

IPL 2022 FULL LIST OF PLAYERS WHO DISMISSED VIA HIT WICKET IN IPL HISTORY SJN

IPL 2022 : వామ్మో.! ఐపీఎల్ లో ఈ లిస్ట్ చాలా పెద్దదే సుమా.. క్యాష్ రిచ్ లీగ్ లో హిట్ వికెట్ల జాబితా ఇదే..

జడేజా, యువీ, వార్నర్ (ఫైల్ ఫోటోస్)

జడేజా, యువీ, వార్నర్ (ఫైల్ ఫోటోస్)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా.. నాకౌట్ దశకు  అర్హత సాధించేందుకు కేవలం కొన్ని జట్లకు మాత్రమే అవకాశం కనిపిస్తున్నాయి. వీటిలో ప్రథమంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) ఉన్నాయి.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆఖరి ఘట్టానికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా.. నాకౌట్ దశకు  అర్హత సాధించేందుకు కేవలం కొన్ని జట్లకు మాత్రమే అవకాశం కనిపిస్తున్నాయి. వీటిలో ప్రథమంగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) ఉన్నాయి. ఆ తర్వాత రెండు స్థానాల కోసం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. కానీ, ఇవి ఇంకా అధికారికంగా నాకౌట్ రేసు నుంచి అయితే తప్పుకోలేదు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి  : ఎవరికీ ఇబ్బంది కలగకుండా తన వికెట్ ను తానే తీసుకున్న గుజరాత్ ప్లేయర్.. ఎలాగో చూసేయండి మరీ..

అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయి వికెట్లను బ్యాట్ తో గిరాటేశాడు. దాంతో హిట్ వికెట్ గా పెవిలియన్ కు చేరక తప్పలేదు. ఈ ఐపీఎల్ లో ఇదే తొలి హిట్ వికెట్ అయితే క్రికెట్ లో హిట్ వికెట్ గా ఒక ప్లేయర్ అవుటయ్యేది చాలా అరుదైన విషయం. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 14 సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం 15వ సీజన్ ను జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 13 మంది ప్లేయర్స్ హిట్ వికెట్ గా వెనుదిరిగారు. వారెవరో తెలుసుకోవాలంటే చదివేయండి మరీ..





































































































క్ర. సంఖ్యప్లేయర్జట్టుప్రత్యర్థిఏ సీజన్
1ముసావిర్ ఖోటేముంబైపంజాబ్2008
2మిస్బా ఉల్ హక్ఆర్సీబీపంజాబ్2008
3స్వప్నిల్ అస్నోద్కర్రాజస్తాన్చెన్నై2009
4రవీంద్ర జడేజాచెన్నైడెక్కన్ చార్జర్స్2012
5సౌరభ్ తివారీఆర్సీబీముంబై2012
6యువరాజ్ సింగ్సన్ రైజర్స్ముంబై2016
7దీపక్ హుడాసన్ రైజర్స్ఢిల్లీ డేర్ డెవిల్స్2016
8వార్నర్సన్ రైజర్స్పంజాబ్2016
9షెల్డన్ జాక్సన్కోల్ కతారైజింగ్ పుణే2017
10రియాన్ పరాగ్రాజస్తాన్కేకేఆర్2019
11హార్దిక్ పాండ్యాముంబైకేకేఆర్2020
12జానీ బెయిర్ స్టోసన్ రైజర్స్ముంబై2021
13సాయి సుదర్శన్గుజరాత్ముంబై2022

హిట్ వికెట్ గా అవుటైన ప్లేయర్స్ జాబితాలో సన్ రైజర్స నుంచి ఎక్కువ మంది ఉండటం విశేషం. ఆ జట్టు నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లు హిట్ వికెట్ గా వెనుదిరిగారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, David Warner, IPL, IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Rajasthan Royals, Ravindra Jadeja, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Yuvraj Singh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు